- అధికారులు సర్వే చేసి నివేదిక ఇచ్చారు
- ఒకవేళ నిబంధన విరుద్ధంగా ఉందంటే నేనే కూల్చేస్తా
- కేటీఆర్, హరీశ్, సబితా కావాలనే నన్ను టార్గెట్ చేశారు
- శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రతిపక్ష పార్టీ నేతలు చెబుతున్నట్టు తన ఫాం హౌస్ బఫర్ జోన్‌లో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు. తన ఫామ్ హౌజ్ ప్రభుత్వ నిబంధనలు మేరకే ఉందన్న ఆయన ఒకవేళ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్నట్లయితే తానే దగ్గరుండి కూల్చివేయిస్తానని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి తన పేరు తెరపైకి తెచ్చి ఆరోపణలు ఉన్నాయని, తన ఫామ్‌హౌజ్ రూల్స్‌కు విరుద్ధంగా నిరూపిస్తే అక్కడికి తీసుకెళ్లి వారి సమక్షంలో కూల్చివేయిస్తానని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఇరవై ఏళ్ల క్రితమే అన్నీ పరిశీలించి, అధికారులతో కూడా చర్చించి ఫామ్ హౌజ్ కట్టినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు.
ఇటీవల కూడా మళ్లీ సర్వే చేసి బఫర్ జోన్‌లో ఉన్నట్లు అధికారులు నివేదిక ఇచ్చారని, ఒకవేళ ఆ రిపోర్ట్ అసత్యమైతే ఫామ్‌లో హౌజ్‌ను కూల్చడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దూరం నుంచి చూస్తే నీళ్లల్లో కనిపిస్తుంది కానీ, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో తెలుస్తుంది. తన ఫామ్ హౌజ్ పక్కనే సబితా ఇంద్రారెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి కూడా ఉంది. అయితే హిమాయత్ సాగర్‌లో ఆక్రమణలు తొలగించాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మంచిదని, దానికి అందరూ సహకరించాల్సిందేనన్నారు. తనకు నోటీసు వచ్చినా ఫామ్ హౌజ్ కూలగొట్టేస్తానని స్పష్టం చేశారు. తాను గతంలో పనిచేశానని, ఎవరితో చెప్పుకోవాల్సిన అవసరం ఉందని. రూల్స్ ఎవరికైనా ఒకటేనని, బఫర్ జోన్, ఎఫ్ టీఎల్‌లో ఉన్నట్లయతే తనదైన కేటీఆర్, హరీశ్‌రావు వైనా కూల్చాల్సిందేనని మహేందర్ రెడ్డి అన్నారు.