ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు కుమారుడు నారా రోహిత్ గురించి అందరికీ తెలుసు. 2009లో బాణం చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోహిత్ అప్పటినుంచి అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నారు. కొన్ని సినిమాలు కూడా విజయం సాధించాయి. కొన్ని పరిస్థితుల కారణంగా రోహిత్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఇతని కంటే పెద్ద వాడైన నారా శిరీష్‌కి కూడా ఇంతవరకు పెళ్లి కాలేదు. అయితే రోహిత్‌కి మాత్రం పెళ్లి ఘడియ వస్తోంది. అక్టోబర్ 13న ఎంగేజ్‌మెంట్ జరగబోతోంది.
ఈ జాబితాలో సీఎం చంద్రబాబునాయుడుతోపాటు నందమూరి బాలకృష్ణ, వారి కుటుంబ సభ్యులు కూడా హాజరు అవుతారని. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. ఈ వివాహం జరగడానికి కారణమని తెలుస్తోంది. అయితే రోహిత్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అనే వివరాలు మాత్రం తెలియరాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 'ప్రతినిధి2' చిత్రంలో రోహిత్‌తో కలిసి నటించిన అమ్మాయే వధువు అని సమాచారం.