19
నాగార్జున సాగర్ సుంకిశాల పంప్ హౌజ్ వద్ద భారీ ప్రమాదం జరిగింది. సొరంగంలోని నీరు రాకుండా నిర్మించిన రిటెయినింగ్ వాల్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిసింది. హైదరాబాద్ సాగర్ అవసరాలు తీర్చడం కోసం కృష్ణాజలాలను తరలించేందుకు నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సమీపంలో సుంకిశాల పంప్ హౌజ్ నిర్మాణం జరుగుతోంది. సాగర్ కు భారీ వరద వచ్చి చేరడంతో రక్షణ గోడ ఒత్తిడికి గురై కుప్పకూలింది.