31
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)కు తప్పిన పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాలతో అనంతపురం వరదలు చుట్టుముట్టాయి. ఈ వరదల్లో నాగార్జున చిక్కుకున్నారు. ఒక జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్ కోసం ఆయన అనంతపురానికి వెళ్లారు. పుట్టపర్తి వరకు ఫ్లయిట్లో వెళ్లిన నాగార్జున.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురానికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు వరదల్లో చిక్కుకుంది. వెంటనే అలెర్ట్ అయిన అధికారులు రూట్ మళ్లించడంతో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు