Home సినిమా నయనతార బాటలోనే శోభిత ధూళిపాళ్ల!నాగార్జున,చైతు ఏమంటారో మరి – Prajapalana News

నయనతార బాటలోనే శోభిత ధూళిపాళ్ల!నాగార్జున,చైతు ఏమంటారో మరి – Prajapalana News

by Prajapalana
0 comments
నయనతార బాటలోనే శోభిత ధూళిపాళ్ల!నాగార్జున,చైతు ఏమంటారో మరి


అక్కినేని నాగ చైతన్య(naga chaitanya)శోభిత ధూళిపాళ్ల(sobhita dhulipala)డిసెంబర్ 4 న వివాహ బంధం ద్వారా ఒక్కటవుతున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియాలో ఉన్నఅక్కినేని నాగేశ్వరరావు(anr)విగ్రహం దగ్గర జరిగే ఆ వివాహ వేడుకకు కేవలం మూడువందల అతిధులని మాత్రమే అక్కినేని కాంపౌండ్ ఆహ్వానిస్తుంది. తన జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని శోభిత పూర్తి చేస్తున్న నమ్మకం కూడా తనకి ఉందని చైతన్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ వివాహానికి ఉన్న ఇంపార్టన్స్ ని అర్ధం చేసుకోవచ్చు.

ఇక తమ వివాహాన్ని ఒక డాక్యుమెంటరీగా చిత్రీకరించి ప్రేక్షకుల ముందుంచాలనే ప్లాన్‌లో చైతు, శోభిత ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.ఆ డాక్యుమెంటరీలో చైతన్య కెరీర్, వ్యక్తి గత జీవితంలో ఎదురైన ఇబ్బందులు,శోభిత తో పరిచయం,ప్రేమ,పెళ్లి గురించి చూపించినట్లు చెబుతున్నారు.ప్రముఖ హీరోయిన్ నయనతార గతంలో తన పెళ్లిని డాక్యుమెంట్ రూపంలో చిత్రీకరించింది.' బియాండ్ ది ఫెయిరీ టేల్' గా సిద్దమైన ఆ డాక్యుమెంటరీ నవంబర్ 18 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ వస్తుంది.ఇక చైతు, శోభిత ల డాక్యుమెంటరీ హక్కులు పొందేందుకు నెట్ ఫ్లిక్స్ తో పాటు పలు ఓటిటి సంస్థలు పోటీ పడుతున్నాయి.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech