Home తెలంగాణ నకిలీ నోట్ల చలామణి కేసులో నలుగురు నిందితుల అరెస్ట్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

నకిలీ నోట్ల చలామణి కేసులో నలుగురు నిందితుల అరెస్ట్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
నకిలీ నోట్ల చలామణి కేసులో నలుగురు నిందితుల అరెస్ట్ - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • రూ.7.95 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం
  • కేసు వివరాలు వెల్లడించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ కే నారాయణరెడ్డి

వికారాబాద్ , ముద్ర ప్రతినిధి: నకిలీ నోట్లు చలామణి చేసి నలుగురు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూరు పోలీసులు అరెస్టు చేసి శనివారం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు పూర్తి వివరాలు జిల్లాపీ నారాయణ రెడ్డి శనివారం మీడియా సమావేశంలో. జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటలకు తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని అయ్యప్ప నగర్‌లో నివసించే మండిగి చంద్రయ్య వయస్సు 51 సం, వృత్తి : బండల వ్యాపారం, పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అతని వద్ద 500 రూపాయల నకిలీ నోట్లు 90 స్వాధీనం చేసుకున్న నిందితుని పైన నమోదు చేశారు. చేసుకొని అతని సమాచారం మేరకు మిగిలిన నిందితులు అయిన 1. ఇచ్చాపురం జగదీష్, 2. బడుగంటి వీర వెంకట రమణ 3. ప్రగళ్లపాటి శివకుమార్ పోలీసులు పట్టుకున్నారు. వీరు ఇచ్చాపురం జగదీష్ నివాసం ఉండే మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా , దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిదధిలోని మల్లంపేట లో వృషభాద్రిలో స్వాధీనం చేసుకొని వారి వద్ద నుండి నకిలీ 500 రూపాయల నోట్లు 1500 విలువ మొత్తం 7,50,000 రూపాయలతో పాటు నకిలీ నోట్లను ఉపయోగించిన పేపర్ మానిటర్, సిపి యు ప్రింటర్ , రిబ్బన్ మరియు 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది.

నిందితుల నేర చరిత్ర

1.మండిగి చంద్రయ్య, వయస్సు 51 సం, వృత్తి బండల వ్యాపారం, కులం ముదిరాజ్, నివాసం ఇంధర్ చెడ్, బషీరాబాద్ మండలం ప్రస్తుత నివాసం అయ్యప్ప నగర్, తాండూర్ వికారాబాద్ జిల్లా.

2.జగదీష్ వయస్సు 42 సం, కులము చాకలి, వృత్తి మాజీ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, మార్కెటింగ్ నివాసం సుంకరిపేట విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత నివాసం మల్లంపేట బాచుపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.

గత నేర చరిత్ర :- గతంలో ఇతను బ్యాంక్ ఆఫ్ బరోడా జహీరాబాద్ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్నప్పుడు బ్యాంక్ నిధులను దుర్వినియోగం చేసినందుకు ఇతనిపై సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్‌నందు కేసు నమోదు కాగా ఒక నెల సంగారెడ్డి జిల్లా కంది జైలులో ఉన్నాడు.

3.బడుగంటి వీర వెంకటరమణ వెంకీ వయస్సు 27 సం, వృత్తి వెల్డర్ కులము పద్మశాలి నివాసము నరసాపురపుపేట గ్రామం, రామచంద్రాపురం మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ప్రదేశ్.

గత నేర చరిత్ర :- గతంలో ఇతను నకిలీ నోట్లు చలామణి చేసినందుకు రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నందు కేసు నమోదు అయ్యింది. అలాగే గంజాయి అక్రమ రవాణా చేసినందుకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్ నందు కేసు కాగా మూడు నెలలు సంగారెడ్డి జిల్లా కంది జైలులో ఉన్నాడు. అప్పుడు ఇతనికి జైలులో ఇచ్చాపురం జగదీష్ తో పరిచయం ఏర్పడింది. అలాగె వడ్యాది మాడుగుల పోలీస్ స్టేషన్ అల్లూరి సీతరామరాజు జిల్లా నందు కూడా గంజాయి అక్రమ రవాణా చేసినందుకు కేసు నమోదు అయింది .

4.ప్రగల్లపాటి శివకుమార్ వయస్సు 43 వృత్తి ఫోటోగ్రాఫర్ కులము వైశ్య నివాసము తమరాడ గ్రామము కిర్లంపూడి మండలం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్ర ప్రదేశ్.

స్వాధీనం చేసుకున్న వాటి వివరాలు:-

1. 1590 నకిలీ 500 రూపాయల నోట్ల విలువ రూ. 7,95,000/-

2. కంప్యూటర్, ప్రింటర్, పేపర్, రిబ్బన్

3. మొబైల్ ఫోన్లు

నకిలీ నోట్ల చలామణి పైన చట్టరీత్యా కటినమైన చర్యలు ఉంటాయి అని జిల్లా ఎస్పీ తెలిపారు. నిరక్షరాస్యులు, చిరు వ్యాపారులు, వృద్ధులు మరియు రద్దీగా ఉండే వ్యాపార సముదాయాలను, లక్యంగా చేసుకొని నేరస్తులు దొంగ నోట్లను చలామణి చేస్తారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దొంగ నోట్లకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలి అని ఎస్పీ తెలిపారు.

తాండూరు డి.ఎస్.పి బాలకృష్ణ రెడ్డి అధ్వర్యంలో జి.సంతోష్ కుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, తాండూర్ టౌన్ ఎస్ ఐ రాములు, హెడ్ కానిస్టేబుల్ అంజద్, పోలీస్ కానిస్టేబుల్. శివ కుమార్, సాయప్ప , షబీల్ , ప్రభులింగం లు నిందితులను మరియు నకిలీ కరెన్సీ పెట్టుకోవడంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించారు. వారికి తగిన ప్రోత్సాహకాలు అందించాలని ఎస్పీ తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech