దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కలకలం సృష్టించింది. సీఆర్ఫీఎఫ్ పాఠశాలకు సమీపంలో పేలుడు జరగడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రోహిణి ఏర్పాటు ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల బయట ఆదివారం ఉదయం 7:50 గంటలకు పేలుడు జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పేలుడు దాటికి స్కూల్ గోడ, పార్కింగ్ చేసిన కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో అక్కడున్న వారంతా పరుగులు పెట్టారు.
ఈ పేలుడుతో పాఠశాలలో ఎవరికి ఏం జరగలేదు. పేలుడు తర్వాత ఆ ప్రాంతంలో పొగలు కమ్ముకున్నాయి. అదే పాఠశాల గోడను ఆనుకుని అనేక దుకాణాలు ఉన్నాయి. సిలిండర్ పేలినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. పేలుడుకు గల కారణాన్ని గుర్తించేందుకు క్లూస్ టీమ్, బాంబు స్వ్కాడ్ రంగంలోకి దిగాయి. ప్రస్తుతం అధికారులు ఆ ప్రాంతంలో సోదాలు చేస్తున్నారు.
పేలుడు కారణంగా పాఠశాల గోడ కాస్త ధ్వంసం అయింది. వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సమీపంలోని దుకాణం అద్దాలు, దుకాణం సమీపంలోని పార్క్ చేసిన కారు ధ్వంసమైంది. ఎవరికీ గాయాలు కాలేదు. సంఘటనా స్థలానికి క్రైమ్ టీం, ఎఫ్‌ఎస్‌ఎల్ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లను రప్పించాం. అగ్నిమాపక దళం బృందం సంఘటన స్థలంలో ఉంది. పేలుడుకు గల కారణాలు కనిపిస్తున్నాయి” అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ సెల్‌తో సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని పోలీసులు తెలిపారు. ఉదయం 7.47 గంటలకు భారీ పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. తాజా పేలుడుతో ఆ ప్రాంతంలో గాలి మరింత ఎక్కువగా కాలుష్యం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.