ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి కోట్లాదిమంది భక్తులు ఉన్నారు. తిరుపతిలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఏటా కోట్ల మంది భక్తులు వస్తుంటారు. నిత్యం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే భక్తుల సంఖ్య తక్కువేమీ కాదు. తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కొంత ఇబ్బందికరంగా భక్తులకు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ అధికారులు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అనేక ప్రాంతాల వెంకటేశ్వర స్వామి ఆలయాలను ఏర్పాటు చేయడానికి గతంలోనే నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే దేశంలోని ప్రధాన నగరాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలను ఏర్పాటు చేశారు. తాజాగా నిర్వహించిన టిటిడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇందులో అత్యంత ముఖ్యమైనది దేశంలోనే అనేకచోట్ల వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించడం. దేశంలోని కీలక నగరాల్లో వెంకటేశ్వర ఆలయాల నిర్మాణం చర్యలు చేపడుతున్నట్లు టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ ఆలయాలు నిర్మించాలి అంటే దానిపై అధికారులు నిర్ణయిస్తారని చెప్పారు. దీనివల్ల ఆయా ప్రాంతాలని భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఇది ఆయా ప్రాంతాల ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడంతోపాటు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోరికను నెరవేర్చినట్లు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో స్వామివారి ఆలయాలను నిర్మించేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టనున్నారు. అందుకు అనుగుణంగా తీర్మానాన్ని చేశారు.
టిటిడి పాలకమండలి కీలక నిర్ణయాలను కూడా తీసుకుంది. ఈ మేరకు కొన్ని తీర్మానాలు చేశారు. వీటిలో తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలను అందించడానికి జాతీయ హోదా ఇవ్వబడుతుంది. దీని వల్ల కేంద్రం నుంచి అదనపు నిధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గంటలోపు దర్శనంపై అంచనా వేయబడింది. తిరుమలలోని హోటల్ ద్వారా నాణ్యమైన ఆహార పదార్థాలు దేశంలోని ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్సుల జారీలో నూతన విధానం అమలకు ఆమోదం తెలిపింది. ఆక్రమణల అంశంలో తిరుమలలో ఒక మఠానికి ఇప్పటికే షోకాజు నోటీసులు జారీ చేయబడ్డాయి.
నడక మార్గంలో గుండెపోటు మరణాలు జరుగుతున్న నేపథ్యంలో తిరుమల అశ్విని ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నియామకాలకు, అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సహకారంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఫీడ్‌బ్యాక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కంచి పీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటు చేయనున్న సాంప్రదాయ పాఠశాలలకు ఎస్వీ విద్యాదానం ట్రస్టు ద్వారా రెండు కోట్లు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. టీటీడీలో ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటు చేయనున్నారు. సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులను భర్తీకి ఆమోదించారు. అన్న ప్రసాద నాణ్యమైన అన్న ప్రసాదాలు కార్పొరేషన్ ద్వారా వివిధ విభాగాల్లో 25 మంది సిబ్బందిని తీసుకునేందుకు నిర్ణయించారు. ఆల్వార్ ట్యాంకు విశ్రాంతి భవనం నుంచి బాట గంగమ్మ సర్కిల్ మధ్యలోనే సర్వ దర్శన క్యూ లైన్‌లో రూ.3.36 కోట్లతో ఆరు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఒంటిమిట్ట రామాలయంలో విమాన గోపురానికి బంగారు కలశం ఏర్పాటుకు 43 లక్షల రూపాయలు కేటాయించారు. నవీ ముంబైలో పద్మావతి అమ్మవారి ఆలయానికి సీడ్కో కేటాయించిన 3.60 ఎకరాల స్థలానికి రూ.20 కోట్లకుపైగా ఉన్న లీజు ధర తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని పాలక మండల సమావేశంలో తీర్మానించారు.
మన్మోహన్ సింగ్ రాజకీయ ప్రస్థానమిదీ..
డిసెంబర్‌లో ప్రకృతి ప్రసాదించే పండ్లు, కూరగాయలు ఇవే..