ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్తరోడ గ్రామానికి చెందిన దుర్గ తదండ్రులను కోల్పోయిన అనాథగా మారిన విషయం తెలిసిందే. ఈ నేనున్నానని భరోసా కల్పించారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. తన కుమారుడు ప్రతీక్ పేరుతో ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా రూపాయలను తహసీల్దార్ లింగమూర్తి, ఎం పి డి ఓ అబ్దుల్ సమద్ ల ద్వారా పాపకి అందించారు.
అనంతరం పాప దుర్గతో వీడియో కాల్ లో మాట్లాడారు. ఆర్థికంగా చేయూతను అందించడంతో పాటు చిన్నారి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు చదివిస్తానని అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పెళ్లి అయ్యేవరకు ఉంటున్నానని.ప్రతి నెల ఖర్చుల కోసం పంపుతానని, త్వరలో పాపను కలుస్తానని అన్నారు. ఉండేందుకు ఇల్లు కూడా కట్టిస్తానని. అధైర్యపడకూడదని, నేనున్నానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సభ్యులు, స్థానిక నాయకులు ఉన్నారు.