- పంట రుణాల పంపిణీలో వేగం పెంచాలి
- త్వరలోనే రీజినల్ రింగ్ రోడ్డు పనులకు టెండర్లు
- మహిళలను కోటీశ్వరుల్ని చేయడం ప్రభుత్వ లక్ష్యం
ముద్ర, తెలంగాణ బ్యూరో : రైతు రుణమాఫీ, రైతు భరోసా ద్వారా రైతులకు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంక్షేమ పథకాల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. వేల కోట్లు విడుదల చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. ఈ నేపథ్యం లో సబ్సిడీ పథకాలు, మ్యాచింగ్ గ్రాంట్ ల రూపంలో పెద్ద సంఖ్యలో రుణాలు ఇచ్చేందుకు రెడీ బ్యాంకర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. బ్యాంకర్లు ఏ రాష్ట్ర అర్థికాభివృద్ధికైనా వెన్నుముక వారనీ జిడిపి పెరుగుదలకు కీలక భూమిక నిర్వహిస్తున్న బ్యాకర్లను భట్టి అభినందనలు తెలిపారు. రబీ పంట రుణాల పంపిణీలో వేగం పెంచాలన్న ఆయన రైతులకు సకాలంలో రుణాలు అందకపోతే అది వృథా అన్నారు.
బ్యాంకర్లకు రీపేమెంట్ పెరిగింది.. అప్పులు ఇవ్వడం తగ్గిందన్న భట్టి.. ఇది సహజానికి విరుద్ధంగా. ప్రజా ప్రభుత్వం రెండు నెలల వ్యవధిలోనే రూ. 21 వేల కోట్లు రైతు రుణమాఫీ కింద బ్యాంకులకు జమ చేసింది. బ్యాంకర్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నిర్ణయం తీసుకుంది. 2024 ఖరీఫ్ సీజన్‌లో రూ.54,480 కోట్ల రుణాలు లక్ష్యం కాగా 44,438 కోట్లు, 81.57 శాతం విడుదల చేశామన్నారు. టర్మ్ లోన్స్ విషయంలో లక్ష్యానికి మించి పని చేయడం అభినందనీయం అన్నారు. వ్యవసాయ యంత్రీకరణ ఎగ్జిబిషన్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని.. యాంత్రిక రుణాల విషయంలో బ్యాంకర్లు లిబరల్ గా ఉండాలని నిర్ణయించారు. ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణలోనూ బ్యాంకర్లు లిబరల్ గా ఉండాలని కోరారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్లు శ్రద్ధ చూపాలని అన్నారు.
ఈ పరిశ్రమల ద్వారా ఎక్కువ మందికి ఉపాధి.. పెద్ద మొత్తంలో వస్తువుల ఉత్పత్తి.. జిడిపి పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కంపెనీ కంపెనీలకు రుణాలు ఇవ్వడంతో ఆర్థిక వ్యవస్థకు కొద్ది మంది కేంద్రీకృతమవడానికి. బ్రాండ్ కంపెనీలతో పాటు చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు విరివిగా రుణాలు అందించబడతాయి.పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రతిఏడాది రూ. 20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. రాబోయే ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని ఆయన చెప్పారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలతో ఒప్పందం చేసుకుంది.
గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి దేశవ్యాప్తంగా ప్రాధాన్యత ఉందనీ ఈ దృష్టిలో పెట్టుకొని గ్రీన్ పవర్ ఉత్పత్తికి బ్యాంకర్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం వ్యవసాయం, రైతు సంక్షేమాన్ని పట్టించుకోలేదని. రానున్న రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణను చూడబోతున్నామన్న భట్టి.. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. మూసీ పునరుజ్జీవాన్నిప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీకి.. ఫార్మా కంపెనీల నిర్మాణం పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు తెలిపారు.
రైతులను దృష్టిలో ఉంచుకుని పథకాలకు రూపకల్పన : వ్యవసాయ మంత్రి తుమ్మల
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పథకాల రూపకల్పన బ్యాంకర్లకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. డ్రోన్లను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ యంత్రీకరణ ప్రదర్శన ప్రాజెక్టును బ్యాంకర్లు స్వంతంగా నిర్వహించాలని సూచించారు. బ్యాంకులపై ప్రజల్లో విశ్వాసం కోల్పోతే అది భవిష్యత్‌కు నష్టం అన్నారు. బ్యాంకులు ఇచ్చిన అప్పులపై అజమాయిషీ లేకుండా పోయింది. బ్యాంకు అప్పులను తిరిగి కట్టేవాళ్లు కడుతుంటే ఎగ్గొట్టేవాళ్లు ఎగ్గొడుతూనే ఉన్నారని దానితో అర్థం లేకుండా పోతున్నారన్నారు.