- దక్షిణ మధ్య రైల్వే
ముద్ర, తెలంగాణ బ్యూరో : దీపావళి, ఛత్ పూజా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రాంతాలకు 804 ప్రత్యేక రైళ్లను నడప దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రిజర్వుడు, అన్ రిజర్వుడు కోచ్ లతో ప్రత్యేక రైళ్ళను నడుపుతున్నామని చెప్పారు. అన్ రిజర్వుడు ప్రయాణికులు జనరల్ టికెట్ల కోసం కౌంటర్ల వద్ద క్యూలో నిలబడకుండా తమ టిక్కెట్లను యూటీఎస్, మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించామని అధికారులు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక రైళ్ళను సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి), కాచిగూడ స్టేషన్ల నుంచి షాలిమార్, రాక్సాల్, జైపూర్, లాల్ఘర్, హిసార్, గోరఖ్ పూర్, షిర్డీ, దానాపూర్, నిజాముద్దీన్, కటక్, అగర్తల, సంత్రాగచ్చి, మధురై, ఈరోడ్, నాగర్‌కోయిల్, బెంగళూరు, దానాపూర్ ప్రాంతాలకు నడుపుతున్నట్లు తెలిపారు.