Home సినిమా ది లెజెండ్‌ ఆఫ్‌ ప్రిన్స్‌ రామ' మూవీ రివ్యూ – Prajapalana News

ది లెజెండ్‌ ఆఫ్‌ ప్రిన్స్‌ రామ' మూవీ రివ్యూ – Prajapalana News

by Prajapalana
0 comments
ది లెజెండ్‌ ఆఫ్‌ ప్రిన్స్‌ రామ' మూవీ రివ్యూ


భారతీయ భాషల్లో రామాయణ గాధపై ఎన్నో సినిమాలు రూపొందించబడ్డాయి. అయితే 31 ఏళ్ల క్రితం జపాన్‌, ఇండియన్‌ టీమ్‌ కలిసి 'రామాయణ: ది లెజెండ్‌ ఆఫ్‌ ప్రిన్స్‌ రామ' పేరుతో ఓ యానిమేషన్‌ నిర్మించారు. 1997లో ఈ చిత్రం జపాన్‌లో విడుదలై అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఈ ఎన్నో ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించడం ద్వారా అవార్డులు కూడా గెలుచుకుంది. ఆ సమయంలో ఇండియాలో నెలకొన్న రాజకీయ పరిణామాల కారణంగా ఇక్కడ విడుదల కాలేదు. దాదాపు 31 సంవత్సరాల తర్వాత ఇండియాలో ఈ సినిమా విడుదలైంది. జపాన్‌కు చెందిన కోయిచి ససకి, యుగో సాకి, ఇండియాకు చెందిన రామ్‌మోహన్‌తో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించారు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగీష్ భాషల్లో జనవరి 24న ఈ సినిమా విడుదలైంది. ఎన్నో రూపాల్లో మనం చూసిన రామాయణాన్ని యానిమేషన్‌లో ఎలా చిత్రీకరించారు. ఈ సినిమా తీరుతెన్నులు ఏమిటి? అనే విషయాలను ఈ సమీక్షలో పరిశీలించండి.

కథ:

వాల్మీకి రామాయణం ఆధారంగా ఈ దాన్ని రూపొందించారు. రాముడి పుట్టుక గురించి వాయిస్ ఓవర్‌లో చెప్పించి అతనికి 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత విశ్వామిత్రుడు తన యజ్ఞయాగాదులని తాటకి నుండి కాపాడటానికి రామ లక్ష్మణులను పంపమని దశరథుడిని అడగడం నుండి కథని ప్రారంభించారు. రామ లక్ష్మణులు తాటకిని చంపి ఋషులను కాపాడుతున్నారు. ఆ తర్వాత శివధనస్సు విరిచి సీతని పెళ్లి చేసుకుంటాడు రాముడు. రాముడికి పట్టాభిషేకం చేద్దామని ఏర్పాట్లు చేస్తున్న సమయంలో మంథర మాటలు విని కైకేయి దశరథుడిని వరాలు అడగడం, రాముడు తండ్రి మాటకు కట్టుబడి వనవాసానికి బయల్దేరడం వంటి వాటిని తమదైన పద్ధతిలో ప్రదర్శించారు. రాముడు, సీత, లక్ష్మణుడు అడవికి వెళ్లిన తర్వాత దశరథుడు మరణించడం, రాముడుని వెతుక్కు భరతుడు కూడా అడవికి వెళ్ళడాన్ని కూడా యధాతథంగా చూపించారు. శూర్పణఖ ముక్కు, చెవులు లక్ష్మణుడు కోయడం నుంచి సీతను రావణాసురుడు అపహరించి లంకకు తీసుకెళ్లడం, వానర సేనతో కలిసి సముద్రాన్ని దాటి రావణుడ్ని సంహరించడం వరకు మనకు తెలిసిన రామాయణాన్నే చూపించారు. చివరికి రాముడి పట్టాభిషేక ఘట్టాన్ని, రాముడు అవతారాన్ని చాలించడం వంటి వాటిని మళ్లీ వాయిస్ ఓవర్‌తో ముగించారు.

విశ్లేషణ:

రామాయణ ఇతిహాసాన్ని ఎన్నిసార్లు చదివినా, విన్న భారతీయులకు తనివి తీరదు. అలాంటి రామాయణాన్ని మరోసారి యానిమేషన్‌లో చిత్రీకరించడం కొత్తగా అనిపిస్తుంది. ఈ 31 ఏళ్ళ తర్వాత చూస్తే భారతీయులకు అదృష్టం దక్కింది. సినిమా అంతా యానిమేషన్‌లో కనిపించే కథలోని ఎమోషన్‌ ఎక్కడా మిస్‌ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. తెలుగు డైలాగ్స్‌ను బాగా రాసుకున్నారు. పాటలు వరకు హిందీ వెర్షన్‌లో ఉంచారు. ఇప్పటి జనరేషన్‌లోని పిల్లలు తప్పకుండా ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది. పిల్లలకు ఎంతో ఇష్టమైన యానిమేషన్‌లోనే రామాయణ గాధను చూపించడం వల్ల వారికి బాగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఈ గొప్ప ఇతిహాసం గురించి పూర్తిగా తెలుసుకుంటారు.

నిపుణులు:

జపాన్ వారు యానిమేషన్ చిత్రాలను ఎంత అద్భుతంగా తీస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రాన్ని కూడా చక్కగా ప్లాన్ చేశారు. అప్పట్లోనే 450 మంది సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న4కెహెచ్‌డి క్వాలిటీకి అనుగుణంగా సినిమాని తీర్చిదిద్దారు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా సిట్యుయేషన్‌ తగ్గట్టుగా చేశారు. అడవుల్లో వినిపించే సహజ సిద్ధమైన శబ్దాలను బాగా క్యాప్చర్‌ చేశారు.

ఫైనల్‌గా చెప్పాలంటే..:

కంటెంట్ పరంగా, టెక్నికల్‌గా ఈ సినిమా సౌండ్‌గా ఉందని చెప్పొచ్చు. మనకు తెలిసిన రామాయణమే అయినా దాన్ని స్క్రీన్‌పై కొత్త ప్రజెంట్‌ చేసే ప్రయత్నం చేశారు. క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడకుండా ఈ నిర్మించారని సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి జనరేషన్‌కి రామాయణం గురించి అవగాహన కలిగించేలా తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలకు ఈ సినిమా చూపిస్తే బాగుంటుంది. ఇండియా, జపాన్‌ టెక్నీషియన్స్‌ కలిసి ఒక అద్భుత కావ్యంగా 'రామాయణం : ది లెజెండ్‌ ఆఫ్‌ ప్రిన్స్‌ రామ' చిత్రీకరణ ఈ సినిమాకి వున్న ప్రత్యేకత అని చెప్పొచ్చు.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech