టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కి ఎంతో క్రేజ్ ఉంటుంది. సంక్రాంతి టైంలో తమ సినిమాలని రిలీజ్ చేయడానికి స్టార్లు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఈసారి పొంగల్ వార్ కి ముగ్గురు స్టార్లు సై అంటున్నారు. ఈ ముగ్గురు స్టార్లు.. 2019 సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ వార్ కి దిగడం విశేషం.
2019 సంక్రాంతికి 'ఎన్టీఆర్ కథానాయకుడు'తో బాలకృష్ణ, 'వినయ విధేయ రామ'తో రామ్ చరణ్, 'ఎఫ్-2'తో వెంకటేష్ బరిలోకి దిగారు. వీటిలో 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'వినయ విధేయ రామ' నిరాశపరచగా.. 'ఎఫ్-2' బ్లాక్ బస్టర్ గా నిలిచి, వెంకటేష్ ని సంక్రాంతి విన్నర్ చేసింది. ఇక 2025 సంక్రాంతికి కూడా మరోసారి బాలకృష్ణ, రామ్ చరణ్, వెంకటేష్ బాక్సాఫీస్ వార్ కి దిగే అవకాశం వచ్చింది.
బాలకృష్ణ (బాలకృష్ణ) తన 109వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం ఈ సినిమాకి 'వీర మాస్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. (NBK 109)
రామ్ చరణ్ (రామ్ చరణ్) హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ 'గేమ్ ఛేంజర్'. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని మొదట క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల చేయాలని భావించారు. కానీ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కావాల్సిన చిరంజీవి 'విశ్వంభర' వాయిదా పడడంతో, ఇప్పుడు ఆ తేదీకి 'గేమ్ ఛేంజర్' విడుదలైంది. (గేమ్ ఛేంజర్)
'ఎఫ్-2', 'ఎఫ్-3' తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో వెంకటేష్ (వెంకటేష్) ముచ్చటగా మూడోసారి చేతులు కలిపాడు. ఈ సినిమాకి కూడా దిల్ రాజే నిర్మాత. ఈ మూవీని కూడా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయాలని చూస్తున్నారు. పైగా ఈ సినిమాకి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఒకే సమయంలో దిల్ రాజు నిర్మాణం రెండు సినిమాలు విడుదల కానుండటం విశేషమనే చెప్పాలి. (వెంకీ అనిల్ 3)
మరోవైపు 2025 సంక్రాంతి రిజల్ట్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి. 2019 రిజల్ట్ రిపీట్ అయ్యి మళ్ళీ వెంకటేష్ పైచేయి సాధిస్తాడా? లేక ఈసారి బాలకృష్ణ లేదా రామ్ చరణ్ లలో ఎవరైనా పైచేయి సాధిస్తారా? అనేది మూడు నెలల్లో తేలిపోనుంది.