Home సినిమా దిల్‌రాజుకు కీలక పదవిని అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం! – Prajapalana News

దిల్‌రాజుకు కీలక పదవిని అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం! – Prajapalana News

by Prajapalana
0 comments
దిల్‌రాజుకు కీలక పదవిని అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం!


1990లో విడుదలైన పెళ్లిపందిరి చిత్రంతో పంపిణీదారుడిగా కెరీర్‌ను ప్రారంభించి అనతి కాలంలోనే నిర్మాతగా మారి దిల్‌ చిత్రంతో దిల్‌రాజుగా పేరు తెచ్చుకున్నారు వి.వెంకటరమణారెడ్డి. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న ప్రముఖ నిర్మాతల్లో దిల్‌రాజు ఒకరు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌పై రెగ్యులర్‌గా సినిమాలు నిర్మించే దిల్‌రాజుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక పదవిని అప్పగించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కంపెనీ ఛైర్మన్‌గా ఆయన్ని నియమించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. దిల్‌రాజు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రెండేళ్ళపాటు ఈ పదవిలో కొనసాగుతారు.

గత 35 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న దిల్‌రాజు ఇండస్ట్రీని మరింత అభివృద్ధి చేయడానికి కొన్ని ప్రణాళికలు ముందుగానే సిద్ధం చేసుకున్నట్లు తెలియజేసారు. నూతన నటీనటులను, దర్శకనిర్మాతలను ప్రోత్సహించడంతోపాటు సినిమాల ఫెయిల్యూర్స్‌ను తగ్గించేందుకు ఓ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. దిల్‌రాజు డ్రీమ్స్‌ పేరుతో ఓ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దీని ద్వారా ఏడాదికి ఐదు సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేశామని చెప్పారు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను ఈలోగానీ, వచ్చే ఏడాది జనవరిలోగానీ ప్రారంభించే ఆలోచనలో ఉంది. ఈ వ్యవస్థ ద్వారా నటినటులు, రచయితలు దర్శకులు, నిపుణులు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కల్పిస్తున్నామని, సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేయాలనే ఉద్దేశ్యంతోనే దిల్‌రాజు డ్రీమ్స్‌ను స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌పై మూడు సినిమాలు నిర్మించారు. రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతోంది. ఈ సినిమాతోపాటు వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో దిల్‌రాజు నిర్మాణం 'సంక్రాంతి వస్తున్నాం' చిత్రం కూడా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది. నితిన్‌ హీరోగా వేణుశ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'తమ్ముడు' చిత్రానికి కూడా దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించారు.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech