- దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలువు
ముద్ర, తెలంగాణ బ్యూరో : నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. నీకు ఎవడూ భయపడేవాడు లేరని, తాను హైదరాబాద్ లో ఉన్నానని , నువ్వు మగాడివైతే రా చూసుకుందా అని ఆయన సవాల్ విసిరారు. స్పాట్ చేస్తే రావడానికి తాను సిద్దంగా ఉన్నట్లు తెలియజేసారు. అసెంబ్లీ రూల్స్‌కు విరుద్ధంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ తన స్థానంలో కూర్చోకుండా వేరే స్థానంలో కూర్చున్న బీఆర్ఎస్ నేతలను బూతులు తిట్టారని ఆయన చెప్పారు.
కేసీఆర్ పెట్టిన బిక్షతో ఎమ్మెల్యే అయిన నువ్వు , దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలువు అని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఉప్పల్ లో తప్పుడు మాటలు మాట్లాడితే ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి ఉరికించి కొట్టిన సంగతి మార్చిపోయావా? దానం అని ఆయన ప్రశ్నించారు. తాజ్ కృష్ణ హోటల్ లో టీషర్టు, పౌడర్ వేసుకుని నువ్వు వేసే వేషాలు ఎవరికీ తెలియవు అనుకుంటున్నావా అని ఆయన నిలదీశారు.