Home తెలంగాణ త్వరలో కొత్త విద్యుత్ పాలసీ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

త్వరలో కొత్త విద్యుత్ పాలసీ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
త్వరలో కొత్త విద్యుత్ పాలసీ - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • గ్రీన్ ఎనర్జీ కోసం సోలార్ ప్లాంట్లు, పవన్ విద్యుత్
  • 2025 మే నాటికి వైటీపీఎస్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
  • 2028-29 నాటికి 24,488 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరం
  • 20 నెలల్లో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తాం
  • ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి

ముద్ర, తెలంగాణ బ్యూరో : త్వరలోనే తెలంగాణలో కొత్త విద్యుత్ పాలసీ తీసుకువస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిబంధనలను అనుసరించి గ్రీన్ ఎనర్జీని సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, పవన్ విద్యుత్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆదివారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణం శంకుస్థాపన చేసిన భట్టి అక్కడ పవర్ ప్లాంట్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముందు చెప్పినట్లే 2025 మే నాటికి వైటీఎస్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించబడుతుంది. 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని గ్రిడ్డుకు అనుసంధానం చేస్తామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుందన్న ఆయన అధికారిక అంచనాల ప్రకారం 2028-29 నాటికి 24,488 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరం. 2034-38 నాటికి 35,800 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి అవసరం అని అన్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు 20వేల మెగావాట్ల ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుని పటిష్ట చర్యలు చేపడుతున్నాయి. ఈ పాలసీ కోసం విద్యుత్ రంగంలో అపార అనుభవం ఉన్న నిష్ణాతులను, అనుభవజ్ఞుల సలహాలతో ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. శాసనసభలో చర్చలు జరిపి అందరి సహకారంతో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలో రాష్ట్రంలోకి బహుళ జాతి సంస్థలు పెద్ద ఎత్తున తరలి రాబోతున్నాయి.

20 నెలల్లో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తాం..

గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పదేళ్లు కేసీఆర్ ప్రభుత్వం ఎస్ఎల్‌బీసీ సొరంగంలో ఒక్క కిలోమీటర్ పనులు కూడా చేయలేదన్న ఆయన తాము 20 నెలల్లోనే ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు సంక్షేమ విద్యార్థుల మెస్ చార్జీలకు ఒక్క రూపాయి పెంచలేదనీ బడుగు బలహీన వర్గాల కోసమే తెలంగాణ తెచ్చుకున్నామన్నారు.

ఎక్కడా లేనివిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపడుతున్నామనీ మన విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌లో వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. కేసీఆర్ ప్రభుత్వం గత ఏడాది రెసిడెన్షియల్ పాఠశాలలకు రూ. 70 కోట్లు కేటాయిస్తే.. తమ ప్రభుత్వం ఒకే ఏడాది రూ.5 వేల కోట్లు కేటాయించి నిరుపేదలపై మాకున్న చిత్తశుద్ధిని చాటుకుంది.అద్భుతమైన తెలంగాణను ఆవిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రిమండలి రోజుకు 18 గంటల పాటు పనిచేస్తున్నట్లు వివరించారు. ఈ రాష్ట్ర సంపద ప్రజలకు ఉపయోగపడాలి కానీ పాలకులు పంచుకోవడానికి కాదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech