Home సినిమా తెల్లవారుజామున 4 :30 కి సినిమా పడితే చాలు – Prajapalana News

తెల్లవారుజామున 4 :30 కి సినిమా పడితే చాలు – Prajapalana News

by Prajapalana
0 comments
తెల్లవారుజామున 4 :30 కి సినిమా పడితే చాలు


బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో నందమూరి బాలకృష్ణ మంచి జోరు మీదున్నారు.దీంతో ఆయన అప్ కమింగ్ మూవీ 'డాకు మహారాజ్'పై బాలకృష్ణ అభిమానుల్లోను,ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న ఈ మూవీలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ద శ్రీనాధ్ లు హీరోయిన్లుగా చేస్తుండగా,చిరంజీవికి వాల్తేరు వీరయ్య లాంటి హిట్ ని అందించిన బాబీ దర్శకుడు సూపర్ గా చేసాడు.అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది.

రీసెంట్ గా చిత్ర బృందం ఒక ప్రెస్ మీట్ ని నిర్వహించింది.ఒక రిపోర్టర్ నాగవంశీతో చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కి తరలి వెళ్తుందనే వార్తలు వస్తున్నాయి కదా అని అడగటం జరిగింది. అప్పుడు ఆయన మాట్లాడుతు నేను డబ్బు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఏపీకి ఏం చేస్తాను.పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే ఆయన్ని కలిస్తే ఏపీ ప్రభుత్వం నుంచి సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ మాతో ఫస్ట్ మీటింగ్ లోనే చెప్పాడు.ఆ విధంగా అయన చేసాడు కూడా. ఆ సపోర్ట్ అలాగే కనిపిస్తుంది.

సంక్రాంతి సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదు.తెల్లవారుజామున 4.30కి సినిమా పడితే చాలు.ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్ రాజు అమెరికాలో ఉన్నారు.ఆయన హైదరాబాద్‌ వచ్చాక అందరం కలిసి డిసైడ్ చేసి మాట్లాడుతాం.పైగా ​​ఆయన సినిమా అందరికంటే ముందు ఏం చెబుతారో చూద్దాం.సీఎంగారు ఓకే! చంద్రబాబుగారిని, పవన్‌గారిని కలుద్దామని ఎవరూ చెప్పలేదని చెప్పడం జరిగింది.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech