- తెలంగాణకు రూ. 416 కోట్లు
- ఏపీకి 1036 కోట్లు
- ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ నిధులు
- కేంద్ర బృందాల పూర్తి నివేదిక తర్వాత మరిన్ని నిధులు
- కేంద్ర ప్రకటించిన హోం శాఖ
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తం 14 రాష్ట్రాలకు రూ.5,858.60 కోట్ల నిధులను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా స్టేట్ డిజా రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) అడ్వాన్సు నుంచి ఈ నిధులను అందించింది. తెలంగాణకు రూ.416.80 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లు విడుదల చేసింది. అత్యధికంగా మహారాష్ట్రకు రూ.1,432 కోట్లను ఇచ్చింది. గుజరాత్‌కు రూ.600 కోట్లు, కేరళకు రూ.145.60 కోట్లను కేటాయించింది. రాష్ట్ర విపత్తు నిధికి ఎన్డీఆర్ఎఫ్ నుంచి కేంద్రం వాటాగా ఈ మేరకు నిధులను విడుదల చేసింది. ఇటీవల భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, కేరళ సహా వరద ప్రభావిత రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు ఉన్నాయి. వరదల వల్ల ఆయా రాష్ట్రాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ నివేదిక ఇచ్చాయి. దీంతో తక్షణ సాయంగా కేంద్ర హోంశాఖ నిధులను అందించింది.
రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో పాటు, కేంద్ర బృందం వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలతో జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసి రూ. 10 వేల కోట్లు నష్టపోయినట్లు నివేదికలు ఇచ్చింది. అయితే, ఆయా నష్టాలను అంచనా వేసిన కేంద్రం.. తక్షణ సాయంగా ఈ నిధులు కేటాయించింది. కేంద్ర బృందాల నుంచి పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిధులు అందించినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
మంగళవారం రాత్రి మొత్తం 14 రాష్ట్రాలకు వరద సాయం విడుదల కేంద్రం ప్రకటించింది. ఇందులో అస్సాంకు రూ. 716 కోట్లు, బిహార్‌కు రూ. 655.60 కోట్లు, గుజరాత్‌కు 600 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు 189.20 కోట్లు, కేరళకు రూ. 145.60 కోట్లు, మణిపూర్‌కు 50 కోట్లు, మిజోరంకు 21.60 కోట్లు, నాగాలాండ్‌కు రూ. 19.20 కోట్లు, సిక్కింకు 23.60 కోట్లు, త్రిపురకు 25 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు 468 కోట్లు కేటాయించారు.