తెలుగుదేశం పార్టీ కృషిచేసిన కూటమి అధికారంలోకి రావడానికి నాయకులు, కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులను అప్పగించే ప్రక్రియను సీఎం చంద్రబాబు నాయుడు వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో వివిధ కార్పొరేషన్లు, డైరెక్టర్ల పోస్టులను భర్తీ చేశారు. ఈ నేపథ్యంలోనే మిగిలిన నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే సహకార సంస్థలు, మార్కెట్ కమిటీల ఉద్యోగాలను జనవరిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు దాదాపు పదివేల పదవులు క్షేత్రస్థాయి నేతలకు దక్కనున్నాయి. వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించే లోపు వీటికి నామినేటెడ్ పాలకవర్గాలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. చర్యలను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,300 వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో ఒక్కో ఛైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను నామినేట్ చేయడం ద్వారా మొత్తంగా 6,900 మందికి అవకాశం లభించనుంది. వీటిలో ప్రత్యేకించి రిజర్వేషన్లు లేకపోయినా స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సామాజిక న్యాయం పాటించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఖరారు చేసే బాధ్యతను ఇన్‌చార్జి మంత్రులకు అప్పగించారు. సంక్రాంతి నాటికి ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రెండో దశలో జిల్లా సహకార బ్యాంకులు, జిల్లా మార్కెటింగ్ సంస్థలకు కూడా ముగ్గురు సభ్యుల పాలకు వర్గాలను నియమించారు. ఆ తర్వాత రాష్ట్ర సహకార బ్యాంకు పాలక మండలి ఖరారు చేసి నామినేట్ చేయనున్నారు. జిల్లాస్థాయి పదవులు ఆశిస్తున్న నేతలు ఇప్పటికే తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. వ్యవసాయాత్ర సంఘాల ఉద్యోగుల సంస్థ కూడా భర్తీ చేసే యువతలో ప్రభుత్వం కనిపిస్తోంది. అదే సమయంలో వందల సంఖ్యలో ఉన్న మత్స్యకార సొసైటీలు కూడా నామినేటెడ్ పాలకవర్గాలు నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. వీటికి కూడా జనవరిలోనే పాలక మండళ్లను నియమించే అవకాశం ఉంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాల నియామకం కసరత్తు ప్రభుత్వ స్థాయిలో. వీటికి ఎన్నికలు ఉండవు. రెండేళ్ల కాల పరిమితులతో నామినేటెడ్ పాలకవర్గాలను నియమించనున్నారు. రాష్ట్రంలో 222 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఒక్కో కమిటీ చైర్మన్‌తో కలిపి 15 మంది సభ్యులను నియమించనున్నారు. ఈ కమిటీలు చైర్మన్ పదవుల్లో సగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రిజర్వ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రొటేషన్ లో భాగంగా రెండేళ్ల తర్వాత ఇప్పుడు రిజర్వేషన్లు ఉన్న చైర్మన్ పదవులు జనరల్ కానున్నాయి. అప్పుడు జనరల్ లో ఉన్నవి రిజర్వేషన్ లోకి వస్తాయి. ఈ విధంగా పదవుల పంపకాలకు సంబంధించిన చర్యలను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది.
విటమిన్ E | ఆరోగ్యానికి విటమిన్-ఈ.. కచ్చితంగా తెలుసుకోవాల్సిన ప్రయోజనాలు ఇవే..
పుష్ప2 యాక్టర్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా!