ఈ దీపావళికి తెలుగు సినిమాలు 'క', 'లక్కీ భాస్కర్'తో పాటు, తమిళ సినిమా 'అమరన్', కన్నడ సినిమా 'బఘీర' థియేటర్లలో అడుగుపెట్టాయి. వీటిలో 'బఘీర' తప్ప మిగిలిన మూడు సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా 'అమరన్'కి తెలుగులో ఊహించని రెస్పాన్స్ లభిస్తోంది. (అమరన్ కలెక్షన్స్)
తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన అమరన్.. కేవలం మూడు రోజుల్లోనే రూ.7 కోట్లకు పైగా షేర్ రాబట్టి ప్రాఫిట్స్ లోకి ప్రవేశించింది. మొదటి మూడు రోజులు తెలుగునాట రూ.2 కోట్లకు తగ్గకుండా షేర్ కలెక్ట్ చేసిన ఈ మూవీ.. నాలుగో రోజు ఆదివారం కావడంతో మరో రూ.2 కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశం ఉంది. ఈ లెక్కన ఫుల్ రన్ లో తెలుగులో భారీ లాభాలను చూసే అవకాశం ఉంటుంది.
2014లో జమ్మూకాశ్మీర్ ఉగ్రవాదులతో పోరాడి వీర మరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా 'అమరన్' రూపొందించబడింది. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు. అక్టోబర్ 31న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ మూవీ, పాజిటివ్ టాక్ తెచ్చుకొని, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.10 కోట్ల గ్రాస్ (రూ.50 కోట్ల షేర్) క్లబ్ లో చేరింది. ఫుల్ రన్ లో 'అమరన్' చిత్రం రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.