42
తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీలతో వరస భేటీలు నిర్వహించి సీఎం బిజీబిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా బుధవారం చార్లెస్ స్క్వాబ్ హెడ్ ఆఫీస్‌ను రేవంత్ రెడ్డి, టీమ్ సందర్శించనున్నారు. అమెరికన్ ఎయిర్ లైన్స్ సీనియర్ లీడర్‌షిప్‌తో భేటీ కానున్నారు.
అనంతరం ఐటీ సర్వీస్ అలయన్స్‌లతో రాష్ట్ర పెట్టుబడులపై సమావేశం నిర్వహించారు. ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. మహాత్మగాంధీ మెమోరియల్ ప్లాజాలో సీఎంకి సన్మానంగా తెలుగువారు నిర్వహించనున్నారు. 3న అమెరికా వెళ్లిన సీఎం అక్కడ పర్యటన ముగించుకుని దక్షణి కొరియా వెళ్లనున్నారు.