- స్థానికత విషయంలో అనుమానాస్పదంగా రాష్ట్ర సర్కార్ తీరు
- ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో: మెడిసిన్ సీట్ల విషయంలో రాష్ట్ర సర్కార్ అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 33 ప్రకారం నిర్ధేశించిన స్థానికతలోని అంశాలు, వేలితో విద్యార్థుల కళ్లను పొడిచినట్లే ఉన్నాయి. కొత్త నిబంధనల ప్రకారం తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తుంది.
ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో 9వ తరగతి నుంచి 12 తరగతి వరకు చదివిన విద్యార్థులే స్థానికులవుతారని చెబుతున్నారని, ఈ నిర్ణయం ప్రకారం చాలా మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులే తెలంగాణలో లోకల్ అవుతారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నందున ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చాలా మంది ఇక్కడే విద్యాభ్యాసం నిషేధించారు, కొత్త నిబంధనల ప్రకారం వారంతా తెలంగాణలో లోకల్ అవుతారని వివరించారు. అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో చదివే మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు నాన్ లోకల్ అయ్యే ప్రమాదం ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
2023-24 విద్యా సంవత్సరం వరకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నాలుగేళ్లుగా ఎక్కడ చదివితే అదే స్థానికంగా గుర్తించినట్లు వివరించారు. ఆ కారణంగా మన విద్యార్థుల ఇంటర్మీడియట్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు వారిని లోకల్‌గానే పరిగణించే వారని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న కొత్త నిబంధనల ప్రకారమైతే వేలాది మంది ఇతర రాష్ట్రాలు తెలంగాణలో విద్యార్థులు అవుతారని, దీంతో మన విద్యార్థులు మెడిసిన్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా గతంలో అనుసరించిన విధానాన్నే కొనసాగించాలని.