ముద్ర,తెలంగాణ:- తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్‌గా నేరేళ్ల శారద బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బుద్ధ భవన్ లోని కమీషన్ బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత బాధ్యతలు స్వీకరించారు. ఈ జాబితాలో మహిళా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా ఉన్నారు. నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పద్మావతి రెడ్డి, వినోద్.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నేరెళ్ల శారద మాట్లాడుతూ..
తనపైన నమ్మకం ఉంచి మహిళా కమిషన్ చైర్మన్‌గా నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళలపైన జరుగుతున్న అకృత్యాలను నివారించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. మహిళల సంరక్షణతో పాటు పురుషులు స్త్రీలను గౌరవించే విధంగా పని చేస్తానని అన్నారు. కమీషన్ సమీక్ష సమావేశం తరువాత భవిష్యత్తు కార్యాచరణ మహిళా అని తెలిపారు.