32
ముద్ర,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బోనాల పండగను అత్యంత వైభవంగా నిర్వహించాలని దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. బోనాల పండగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జులై 7వ తేదీ నుంచి బోనాల జాతర ప్రారంభమవుతుందని తెలిపారు. బోనాల మహా జాతర ఏర్పాట్లపై అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. జూబ్లీహిల్స్‌లోని బీసీహెచ్ఆర్డీలో ఆషాఢ మాసం బోనాల జాతర ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖతో సమీక్షా సమావేశం జరిగింది. ఈరోజు హైదరాబాద్ ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.