32
తెలంగాణ పోలీస్ శాఖలో కీలక పరిణామం జరిగింది. సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్లు లభించాయి. మొత్తం ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీ హోదా దక్కింది. ఇంటెలిజెన్స్ చీఫ్ బి.శివధర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి పదోన్నతులు పొందారు. సీఐడీ డీజీగా షికా గోయల్, జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్ర, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష్ బిస్త్ పదోన్నతులు పొందారు.