- తెలంగాణ డబ్బును రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు పంపుతున్నాడు.
- పాలన గాలికి వదిలి ..గాలి మోటర్లలో మంత్రులు
- నిజాలు చెప్పటానికి వెళ్ళి.. మహారాష్ట్రలో సీఎం పచ్చి అబద్దాలు చెప్పారు
- రుణమాఫీపై అక్కడ చెప్పినవన్నీ అబద్దాలే
- రుణమాఫీ బోగస్, రైతుబంధు బోగస్, వరికి బోనస్ బోగస్
- కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు.. గ్యారేజ్ కు పోయాయి
- రోడ్ల మీదున్న వడ్ల కుప్పలే.. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం
- 2లక్షల ఉద్యోగాలు కల్పనపై మహారాష్ట్రలో దగా మాటలు
- విద్యార్థులను వీపులు పగలకొట్టిన చరిత్ర కాంగ్రెస్ సర్కార్ ది
- 40లక్షల మందికి రుణమాఫీ కూడా బోగస్సే
- ఇంకా 22లక్షల మందికి రుణమాఫీ జరగాల్సి ఉంది
- పూర్తి రుణమాఫీ చేసి తీరాల్సిందే
ముద్ర, తెలంగాణ బ్యూరో :- మహారాష్ట్రకు జరగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులకు డబ్బులు పంపించే పనిలో సీఎం రేవంత్ ఉన్నారని బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఆయనతో పాటు క్యాబినెట్ మంత్రులు సైతం రాష్ట్రంలో పాలన గాలికి వదిలి.. రాష్ట్రాల బాట పట్టారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కొనసాగుతున్న అబద్ద ప్రచారాన్నే సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో కూడా కొనసాగించారని ధ్వజమెత్తారు. ఇక్కడ మోసం చేసినట్లుగానే అక్కడి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు నయవంచనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది పూర్తవుతున్నా…ఇంకా ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేయలేదు.
ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలుకు హమీ ఇచ్చారని…. దీని కోసం ప్రత్యేకంగా బ్యాండ్ పేపర్ కూడా రాసి ఇచ్చారని తెలిపారు. అయితే రేవంత్ సర్కార్ ఏ హామీలను అమలు చేసిందో.. వాటిపై ఎక్కడ చర్చిద్దామో చెప్పాలని సవాల్ విసిరారు. ఆరు గ్యారెంటీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకు రేవంత్ సర్కార్ సిద్ధమేనా అని ఆయన ఛాలెంజ్ విసిరారు. అభయహస్తంలో మొదటి హామీ మహిళకు రూ. 2500 దిక్కు సంబంధిత. మొదటి హామీకి దిక్కేలేదు గానీ…… మహారాష్ట్రలో కోతలు కోస్తున్నారని. ఈ హామీ కింద ఒక్కో మహిళకు రూ. 2750 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడి ఉంది. అలాగే ఏకకాలంలో రుణమాఫీ అన్నాడని ఈ సందర్భంగా హరీష్ రావు గుర్తు చేశారు. ఈ హామీపై మాట తప్పామని మహారాష్ట్ర ప్రజలకు రేవంత్ చెప్పాలన్నారు. రాష్ట్రంలోని. 42 లక్షల రైతులకు రూ.31 వేల కోట్ల రుణాలు ఇచ్చి రూ.17వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారన్నారు. రుణమాఫీని 7 నెలలు ఆలస్యం చేసి రైతులపై వడ్డీ భారం మోపింది. దీంతో రైతుల నుంచి బ్యాంకులు ముక్కుపిండి వడ్డీలు వసూలు చేశాయన్నారు. ప్రభుత్వం ఆలస్యం చేయటంతో రైతులపై వడ్డీ భారం పడిపోయింది.
రైతు భరోసా కింగ ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్నారు…..మరి ఇచ్చామని చెప్పగలరా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. అలాగే రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని ….ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. వరి పంటకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ఇచ్చారో లేదో చెప్పాలన్నారు. బోసన్ పక్కన పెడితే ఉన్న వడ్లను ప్రభుత్వం కొనకపోవడం తో రైతులు తక్కువ రేటుకు దళారులకు అమ్ముకునే పరిస్థితి తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కోసం ఒక్క ఇళ్ళు కూడ కట్టలేదు గానీ….. ఉన్న ఇండ్లను కూల్చిన ఘనత రేవంత్ దేనని ఎద్దేవా చేశారు. ఇక 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని.
ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పింది, కెసిఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్టు మహారాష్ట్రలో సిగ్గుచేటని చెప్పుకోవడం. కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది లేదు.. ఎగ్జామ్ పెట్టింది లేదు… మరి ఎలా 50,000 ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జీవో 29 పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేశారన్నారు.ప్రశ్నించిన నిరుద్యోగులపై పోలీసులతో అణిచివేసే ప్రయత్నం చేశారు.రాష్ట్రంలో ఎక్కడ కూడా వడ్ల కొనే పరిస్థితి కనిపించింది. రేవంత్ రెడ్డి అసమర్థత పాలనకు రోడ్ల మీద ఉన్న వారి కుప్పలే సాక్ష్యమన్నారు..బోనస్ ఇచ్చానని బోగస్ మాటలు మాట్లాడాడని ధ్వజమెత్తారు. అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని తేలింది.నోరు తెరిస్తే సోనియమ్మ మాట.. రాహుల్ గాంధీ మాట అంటూ రేవంత్ హామీలిచ్చారని….ఇప్పుడా గాంధీలు ఎక్కడికి పోయారో తెలియదన్నారు. కాంగ్రెస్ చెప్పేదానికి.. చేసేదానికి పొంతన.
.