ఇప్పటికే వాయుగుండం కారణంగా నాల్గు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షాలకు ఎక్కడిక్కడే చెరువులు , వాగులు తెగిపోయి జన జీవనం అస్తవేస్తంగా మారింది. ఎప్పుడు ఈ వర్షాలు తగ్గుతాయో అని రాష్ట్ర ప్రజలు అంత మాట్లాడుకుంటుండగా..ఇప్పుడు మరో తూఫాన్ హెచ్చరిక రాష్ట్ర ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది.
ఈ నెల 5 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని వాయు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రుతుపవన ద్రోణి జైసల్మేర్, రైసేన్, చింద్వారా, తూర్పు విదర్భ ప్రాంతంలో ఉన్న వాయుగుండం కేంద్రం గుండా పొరుగున ఉన్న తెలంగాణ, మచిలీపట్నం మీదుగా వెళ్తుందని.. ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మెరుపు జిల్లాల్లో వానలు ఉన్నాయి. కురిసే అవకాశం ఉందని. ఈ విధంగా ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.