35
- ఘనంగా 102వ అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం
తుంగతుర్తి ముద్ర:- తుంగతు మండల కేంద్రాన్ని రైతు సేవా సహకార సంఘం శనివారం 102వ అంతర్జాతీయ సహకార దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార జెండాను డీసీబీ, డైరెక్టర్ సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు ఎగరవేసి మాట్లాడారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ సహకార సంఘాన్ని బలోపేతం చేయడం కోసం పాలకవర్గం కృషి చేయడం, రైతులకు అందజేసే ఉత్పత్తులు, విత్తనాలు, ప్రభుత్వం త్వరలో రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు రామచంద్రు, మజీద్, యాదగిరి, బిక్షం రెడ్డి, రవీందర్ రెడ్డి, యాకయ్య, చంపా నాయక్ సీఈవో వెంకటేశ్వర్లు సొసైటీ సిబ్బంది యాదగిరి మహేష్ ఉమేష్ ఉన్నారు.