తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డులంటే భక్తులకూ ఎంతో ఇష్టం. అయితే భక్తుల ఇష్టాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు దళారులు అడ్డదారి తొక్కుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు వారంలో ఒక్కరోజే ఉండే తిరుపతి లడ్డూ ఇకపై అన్ని రోజులు తేవాలని నిర్ణయించుకుంది. ఈ సూచన హిమాయత్ నగర్ టీటీ దేవాలయం ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ప్రభు, నిరంజన్ తెలిపారు.
ఇకపై ప్రతిరోజూ హైదరాబాద్ నగర భక్తులకు శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయాలు(టీటీడీ)లో రూ.50కే లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఇప్పటివరకు కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే లడ్డూలు విక్రయించేవారు. ఇక పై ప్రతిరోజూ భక్తులకు లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉండదు.