ముద్ర .వీపనగండ్ల :- బ్రతుకుతెరువు కోసం పట్నం వెళ్లి కూలి పని చేసుకుని బ్రతకాలని తల్లి బుద్ధి చెప్పిన మాటలు నచ్చని కొడుకు ఇంటి నుంచి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన వీపనగండ్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై కే రాణి కథన ప్రకారం చిన్నంబావి మండలం అమ్మాయి పల్లి గ్రామానికి చెందిన ఉల్లంగుండ్ల బాలపీర్ లక్ష్మి ల కుమారుడు ఎరుకలి బాలచందర్ (20) గ్రామంలో పందులను మేపుకుంటూ ఉండేవాడని తెలిపారు.
గ్రామంలో ఉంటే బ్రతుకుతెరువు కష్టంగా ఉంటుందని పట్నం ఏదైనా పని చూసుకొని బ్రతకాలని తల్లితో చెప్పడం, పట్నానికి వెళ్లడం ఇష్టం లేని యువ బాలచందర్ బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో నుంచి తన ద్విచక్ర తో పాటు బయటికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బయటికి వెళ్లిన కొడుకు రెండు రోజుల ఇంటికి తిరిగి రాను ప్రత్యక్ష కుటుంబ సభ్యులు బంధువులు వెతుకుతుండగా అమ్మాయి పల్లి–వీపనగండ్ల గ్రామాల మధ్య ద్విచక్ర వాహనం కనిపించడంతో దగ్గరికి వెళ్లి చూడగా కొడుకు బాలచందర్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ కె. రాణి తెలిపారు.