- కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
- సెక్షన్ 73 కింది విధించే జరిమానాలపై చర్చ
- జరిమానాలపై వేస్తున్న వడ్డీని ఎత్తివేయాలంటూ ప్రతిపాదనలు
- సీజీఎస్టీ చట్టంలో సవరణలకు జీఎస్టీ ప్రతిపాదన
- కార్టన్ బాక్సులు, పాలకాన్లు, సోలార్ కుక్కర్లపై 12 సార్లు జీఎస్టీ తగ్గింపు
- పలు రకాల రైల్వే సేవలకు జీఎస్టీ మినహాయింపు
ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశం ముగిసింది. దీనికి సంబంధించిన వివరాలను నిర్మల సీతారామన్ ఏర్పాటు.
సెక్షన్ 73 కింద విధించే జరిమానాలపై ప్రధానంగా ఉన్నట్లుగా. జరిమానాలపై వేస్తున్న వడ్డీ ఎత్తివేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. సీజీఎస్టీ చట్టంలో సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించాలని నిర్మల సీతారామన్ సూచించారు.
ఇక, అన్ని కార్టన్ బాక్సులపై జీఎస్టీని 12 తగ్గించాలని నిర్ణయించామని చెప్పారు. ఆపిల్, ఇతర పండ్ల వ్యాపారులకు ఈ నిర్ణయంతో మేలు కలుగుతుందని, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్‌లోని ఆపిల్ సాగుదారులకు లాభిస్తుందని అన్నారు.
స్ప్రింకర్లపై జీఎస్టీని 12 తగ్గించాలని నిర్ణయించినట్లు. ఈ నిర్ణయం వ్యవసాయరంగానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అల్యూమినియం, స్టీల్ పాల క్యాన్లపై, సోలార్ కుక్కర్లపై కూడా జీఎస్టీని 12 తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
రైల్వే ప్లాట్ ఫాం టికెట్లు, రైల్వే శాఖ అందించే వెయిటింగ్ రూమ్, రిటైరింగ్ రూమ్ సేవలు, సామాన్లు భద్రచం సౌలభ్యం, రైల్వే శాఖకు చెందిన ప్లాట్ ఫాంలపై సేవలను అందించే బ్యాటరీ ఆధారిత వాహన సేవలను కూడా జీఎస్టీ నుంచి మినహాయించనున్నట్టు తెలిపారు.
ఇక, రేట్ రేలైజేషన్ మంత్రుల సంఘం చైర్మన్ గా బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరిని నియమించినట్లు నిర్మల సీతారామన్.