కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయి ఆ తర్వాత ఓటీలోకి వచ్చేస్తుంటాయి. నేరుగా ఓటీటీలోకి వస్తుంటాయి. ఈ ఏడాది అలా చాలానే రిలీజ్ అయ్యాయి. కానీ ఓ సినిమా కొత్త సంవత్సరం డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి సిద్దమైంది.
జనవరి 2 నుండి ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో రిలీజ్ అవుతున్న సినిమా 'కథా కమామిషు'. కృతికరాయ్, వెంకటేష్ కాకమాను హీరో, హీరోయిన్లుగా నటించగా ఇంద్రజ, కృష్ణ ప్రసాద్ ప్రధాన పాత్రలని పోషించారు. గౌతమ్ ఈ సినిమాకి కథ అందించారు.. గౌతమ్, కార్తీక్ ఇద్దరు ఈ సినిమాని డైరెక్ట్ చేశారు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయగా మంచి స్పందన వస్తోంది. గ్రామీణ ప్రాంతంలో జరిగే కథే ఈ కథా కమామీషు. ప్రేమ, కుటుంబం నేపథ్యంలో సాగే ఓ ఫీల్ గుడ్ మూవీలా ఈ ట్రైలర్ చూస్తే. ఐ డ్రీమ్ మీడియా, త్రీ విజిల్స్ బ్యానర్స్ పై చిన వాసుదేవ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.