చండూరు, ముద్ర:నల్లగొండ జిల్లాలో నిత్యం కరువు కాటకాలకు కొనసాగుతున్నూ ఫ్లోరైడ్ ప్రాంతాలైన దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించే డి0డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను వెంటనే ఆమోదించి సాగు చేసేందుకు మా పోరాటం ఆగదు అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గబండ శ్రీను సభ్యులు తెలిపారు.
శుక్రవారం చండూరు మండల పరిధిలోనినేర్మట,చండూరు,కొండాపురంగ్రామాలలో డిండిఎత్తిపోతల డిపిఆర్ ను ఆమోదించాలని సంతకాల సేకరణకార్యక్రమం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,2016లో జీవో ఎంఎస్ నెంబర్ 107 ద్వారా అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకానికి రోజుకు అర టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు, సింగరాజుపల్లి గొట్టిముక్కుల చింతపల్లిలో లక్ష్మణాపురం శివన్న గూడెం రిజర్వాయర్లు నింపి సాగునీటిని అందించడం ద్వారా ఈ పంటను సాగునీరు అందించడం జరిగింది. ప్రభుత్వం నిర్ణయించినట్లు రిజర్వాయర్లకు సంబంధించిన కొంతమేరకు జరిగిన కీలకమైన పిఆర్‌ను ఆమోదించకపోవడం సుమారు 27 నీటి కాలువలను తవ్వే పనులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల లేఖలు రాయకపోవడం వల్ల ప్రభుత్వం తీవ్రమైన తప్పిదానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మునుగోడు,దేవరకొండ ప్రాజెక్టులకుపర్యావరణ అనుమతులు,అటవీ శాఖ అనుమతులుఇవ్వాలని.పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు తరహాలో మా ప్రాంతాలు కూడా అన్ని అనుమతులు అందించడానికి ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డిండి ఎత్తిపోతల పథకానికి డిపిఆర్ ఆమోదింపజేసి అధిక నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు సిపిఎం దశలవారీగా పోరాటాలు జరిగాయి. మా ప్రాంతాలకుసాగునీరు- త్రాగునీరు అందించే వరకు పోరాటం కొనసాగుతుందనిఆయన తెలిపారు. లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామనిఆయన హెచ్చరిక. ఈ కార్యక్రమంలో సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయగౌడ్, పాలెం శ్రీను,అయితగోని బిక్షమయ్య,కొత్తపల్లి నరసింహ,సత్యనారాయణ, సిహెచ్ ప్రభాకర్, గిరి వెంకయ్య, సిలివేరు బిక్షమయ్య, పాపయ్య, కృష్ణయ్య, సిలువేరు అంజయ్య, వల్గూరి లింగయ్య, ఎం.శ్రీనివాస్, గోపాల్ ఉన్నారు.