గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(బాలకృష్ణ)నుంచి సంక్రాంతి కానుకగా జనవరి 12న 'డాకు మహారాజ్'(డాకు మహారాజ్)రానున్న విషయం తెలిసిందే.ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు,టీజర్ తో సినిమాపై బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.ఇక ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్,ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వరుసగా బాలకృష్ణ అభిమానుల మధ్య ఘనంగా జరగబోతున్నాయి.
ఇక అల్లకల్లోలం మరియు రక్తపాతంతో థియేటర్లను తగలబెట్టే భారీ విధ్వంసానికి కేవలం 9 రోజులు మాత్రమే ఉన్నాయంటు 'డాకు మహారాజ్' టీం రీసెంట్ గా ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది.
ఇక ఈ మూవీలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ ప్రగ్యా జైస్వాల్)శ్రద్ద శ్రీనాద్(శ్రద్దా శ్రీనాథ్)జత కట్టగా బాబీ(బాబీ)దర్శకత్వం వహిస్తున్నాడు.వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ నుంచి వస్తున్న సినిమా డాకు మహారాజ్ నే కావడంతో అందరిలో ఆసక్తి కూడా నెలకొని ఉంది.సితార ఎంటర్ టైన్ మెంట్ అండ్ ఫార్చ్యూన్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తుండగా. సంగీతాన్ని అందించాడు.ఇప్పటికి మూడు పాటలు రిలీజ్ అవ్వగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది