Home తెలంగాణ ట్రిలియన్ డాలర్ ఆర్ధిక వ్యవస్ధగా తెలంగాణ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

ట్రిలియన్ డాలర్ ఆర్ధిక వ్యవస్ధగా తెలంగాణ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
ట్రిలియన్ డాలర్ ఆర్ధిక వ్యవస్ధగా తెలంగాణ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • వచ్చే పదేళ్ల ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం
  • పొరుగు రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడుతాం
  • కాగ్నిజెంట్‌ కొత్త క్యాంపస్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌

ముద్ర, తెలంగాణ బ్యూరో : వచ్చే పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు కొనసాగుతున్న అభివృద్ధిని మరింత వేగంగా తీసుకెళ్తామన్నారు.హైదరాబాద్ అభివృద్ది విషయంలో ప్రపంచంతోనే పోటీ పడుతాం తప్ప,పక్క రాష్ట్రాలతో కాదని సీఎం తేల్చి చెప్పారు. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలను ఇక్కడ అభివృద్ది ప్రకటించారు.హైదరాబాద్‌ కాగ్నిజెంట్‌ క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి బుధవారం గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాగ్నిజెంట్‌ విస్తరణకు తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉందని, రాజీవ్ గాంధీ కృషితో హైదరాబాద్‌లో ఐటీ అభివృద్దికి పునాదిపడిందని సీఎం వివరించారు. రాజకీయ వైషమ్యాలకు పోకుండా చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐటీ అభివృద్దిని కొనసాగించారు. అమెరికా, దక్షిణ కొరియాలో తాము కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పోరేట్ లీడర్స్ తెలంగాణ, హైదరాబాద్‌లో పె ట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఈ పర్యటన ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30,750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయని సీఎం వివరించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech