- మహిళా డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళలు చురుగ్గా పాల్గొనాలి
- సూర్యాపేట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు
తుంగతుర్తి ముద్ర :- కాంగ్రెస్ పార్టీ తిరుమల జిల్లా నమోదు లో సూర్యాపేట జిల్లా ముందు వరుసలో ఉందని ఆ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అనురాధ కిషన్ రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని కొత్తగూడెంలో మహిళా డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ జాతీయ మహిళా కమిటీ అధ్యక్షురాలు అల్కలాంబ రాష్ట్ర మహిళా కమిటీ అధ్యక్షురాలు సునీతా రావు ఈ మేరకు కాంగ్రెస్ సభ్యత్వం డ్రైవ్‌కు హాజరైనట్లు తెలిపారు. నమోదుకు విశేష స్పందన లభిస్తుందని, ప్రతి కార్యకర్త సభ్యత్వం స్వీకరించాలని సూచించారు.
పార్టీ బలోపేతానికి నమోదు కార్యక్రమం వారది. ఉపయోగపడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా ప్రియాంక గాంధీ ఆశయాలను, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం అద్భుతమైన వేదికగా ఉందని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగాలని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరిపై ప్రజలకు చేయాల్సిన అవసరం ఉంది. ముందుగా ఉన్నవారిని రెన్యువల్ చేస్తూ కొత్తవారిని చేర్చుకోవాలని నిర్ణయించుకోండి. ఈ కార్యక్రమంలో పాండవుల పద్మ , సుగుణమ్మ ,పూలమ్మ గీత జరిగింది