Home తెలంగాణ జార్ఖండ్ టు హైదరాబాద్..! హైదరాబాద్ లో బయటపడ్డ ఉగ్రమూలాలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

జార్ఖండ్ టు హైదరాబాద్..! హైదరాబాద్ లో బయటపడ్డ ఉగ్రమూలాలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
జార్ఖండ్ టు హైదరాబాద్..! హైదరాబాద్ లో బయటపడ్డ ఉగ్రమూలాలు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • గత నెలలో ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది రిజ్వాన్ అబ్దుల్ అరెస్ట్
  • ఐసిస్ పుణే మాడ్యూల్ లో పనిచేస్తున్న రిజ్వాన్
  • రిజ్వాన్ కొన్ని నెలలు హైదరాబాద్ లో ఉన్నట్టు నిర్ధారణ
  • తాజాగా సైదాబాద్ లోని శంఖేశ్వర్ బజార్ గ్రీన్ వ్యూ అపార్ట్ మెంట్ లో ఎన్ఐఏ సోదాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉగ్రమూలాలు బయటపడ్డాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసీస్‌కు చెందిన రిజ్వాన్ హైదరాబాద్‌తో సంబంధం ఉన్నట్లు తేలింది. ఇప్పటికే అతనికి నగరానికి చెందిన ఘోరీతో సంబంధం ఉన్నట్లు తేల్చిన ఎన్‌ఐఏ అధికారులు..అనేక సందర్భాల్లో వారిద్దరు సంప్రదింపులు జరిపినట్లు నిర్ధారణకు వచ్చారు. ఘోరీ సహకారంతోనే అతను హైదరాబాద్‌లో సేఫ్ జోన్‌లో ఉన్నట్లు తెలుసుకున్నారు.ఏడాది కాలంగా పరారీలో ఉన్న రిజ్వాన్ ను గత నెల ఢిల్లీలోని ఫరిదాబాద్ సరిహద్దు ప్రాంతంలో అరెస్ట్ చేసిన అక్కడి ప్రత్యేక విభాగం పోలీసులు న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి విచారించారు. ఇందులో రిజ్వాన్ ఇచ్చిన కీలక సమాచారం మేరకు ఎన్ఐఏ అధికారులు ఆదివారం అతన్ని హైదరాబాదుకు తరలించారు. దాదాపు గంటసేపు.. సైదాబాద్ ప్రాంతంలోని శంఖేశ్వర్ బజార్ గ్రీన్ వ్యూ అపార్ట్ మెంట్ లో సోదాలు జరిగాయి. అయితే ఆ సోదాల్లో లభించిన ఆధారాలను కేంద్ర నిఘా బృందం బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.కాగా రిజ్వాన్ హైదరాబాద్ లో ఎన్ని రోజులు ఉన్నాడు…? ఎవరెవరిని కలిశాడు..? వారితో ఏం చర్చించాడు..? నగరంలో ఉగ్రవాద సంస్థలతో ఎవరికి సంబంధాలు ఉన్నాయి..? ఉగ్రవాద సంస్థలకు ఎవరైనా ఆర్ధిక సాయం చేశారా..? ఎంత మందిని ఉగ్రవాదంలో దింపాడు..? వారి నెక్ట్స్ టార్గెట్ ఏంటి..? అనే వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్‌ఐఏ తనిఖీలతో ఆ పరిసర ప్రాంతాల పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానస్పద వ్యక్తులు, పరిసరాల్లో తనిఖీలు.

జార్ఖండ్ టు హైదరాబాద్..!

జార్ఖండ్‌కు చెందిన రిజ్వాన్ 2015=16లోనే డిగ్రీ పూర్తి చేసుకున్న వెంటనే ఆన్‌లైన్‌లో ఉగ్రవాద ప్రేరణ పొంది ఐసీస్ బాట పట్టాడు. అదే సమయంలో అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్న రిజ్వాన్.. 2017లో షహీన్ బ్యాగ్‌కు చెందిన షానవాజ్‌తో పరిచయం చేసుకుని అతని ద్వారా ఉగ్ర కార్యకలాపాలను కొనసాగించారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరఖండ్, ఝార్ఖండ్ ఐసీస్ మాడ్యుల్ విస్తరణతో పాటు, నిధుల సేకరణ కోసం పని చేశాడు.యువతను ఆన్ లైన్ ద్వారా ఆకర్శించి పెద్ద సంఖ్యలో వారిని ఉగ్రవాదం వైపు మళ్లించాడు. ఈ కేసులో పోలీసులు పూణేలో షానవాజ్ గుట్టురట్టు చేశారు. అదే సమయంలో పలువురిని అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రిజ్వాన్ ఉత్తరప్రదేశ్ లోని సంభల్ తలదాచుకున్నాడు. అప్పట్లో రిజ్వాన్ ను మోస్ట్ వాంటెండ్ గురతించిన ఎన్ఐఏ అతనిపై రూ.3లక్షల రివార్డును ప్రకటించారు. కాగా ఈ ఏడాది జనవరిలో రిజ్వాన్ కదలికలను గుర్తించిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు.. సంభల్ లోని అతని స్వాతంత్ర్యంపై దాడి చేశారు. అప్పట్లో తృటిలో తప్పించుకున్న రిజ్వాన్.. హైదరాబాద్‌కు వచ్చి ఆరు నెలల సికింద్రాబాద్‌లో ఉన్నాడు. ఆ తర్వాత కేరళన రిజ్వాన్.. గత నెలలో ఢిల్లీకి వెళ్లగా అక్కడి పోలీసులు గంగాబక్ష్ మార్గ్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 30 బోర్ పిస్టల్, 3 కార్ట్రిడ్జ్ లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech