డ్యాన్సర్‌పై క్రియాశీల వేధింపుల నేపథ్యంలో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్‌పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా నార్సింగి పోలీసులు బాధితురాలి నుంచి ఇప్పటికే స్టేట్ మెంట్ కూడా తీసుకున్నారు. ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పోలీసులు జానీ మాస్టర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.
జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నాడన్న సమాచారంతో అక్కడి పోలీసులతో నార్సింగి పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. పోలీసులు జానీ మాస్టర్‌కు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ కేసులో బాధితురాలికి వైద్య పరీక్షలు చేశారు. మరిన్ని ఆధారాలు సేకరణలో భాగంగా ఇవాళ పోలీసులు బాధితురాలి ఇంటికి మరోసారి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే నార్సింగి పోలీసులు బాధితురాలు ఇంట్లోనే 3 గంటల పాటు విచారించి వివరాలు సేకరించారు.. జానీ మాస్టర్‌పై బాధితురాలు సంచలన విషయాలు బయటపెట్టింది. జానీ మాస్టర్తనపై అత్యాచారం చేసి దాడి చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్ టైంలో క్యారవాన్‌లో బలవంతం చేశాడు. సెక్స్’ కోరిక తీర్చమని నన్ను ఎంతో వేధించాడని..తన మాట వినకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించాడని బాధితురాలు గుర్తించింది.జానీ మాస్టర్ ముంబైతోపాటు హైదరాబాద్‌లో కూడా తనపై దాడి చేశాడని. పెళ్లి చేసుకోవాలని నాపై ఒత్తిడి చేశాడని బాధితురాలు తన స్టేట్మెంట్లో గుర్తించింది.