Home తెలంగాణ జర్నలిస్టు వృత్తి పవిత్రమైనది – జర్నలిస్టులు మానవతా విలువలు పెంపొందించుకోవాలి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

జర్నలిస్టు వృత్తి పవిత్రమైనది – జర్నలిస్టులు మానవతా విలువలు పెంపొందించుకోవాలి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
జర్నలిస్టు వృత్తి పవిత్రమైనది – జర్నలిస్టులు మానవతా విలువలు పెంపొందించుకోవాలి - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరు
  • టియుడబ్ల్యూజె(ఐజెయూ) రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్

ముద్ర.వనపర్తి:-జర్నలిస్టు వృత్తి పవిత్రమైనదనీ నిబద్ధతతో పనిచేసి జర్నలిస్టులు మానవతా విలువలు పెంపొందించుకోవాలని తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు యూనియన్(టీయూడబ్ల్యూజె) రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ అన్నారు. టీయూడబ్యూజె(ఐ జెయూ) వనపర్తి జిల్లా, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరావు అధ్యక్షతన వనపర్తి పట్టణంలోని తరుణి ఫంక్షన్ హాల్‌లో నూతనంగా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మధుగౌడ్‌కు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహిత మధు గౌడ్ మాట్లాడుతూ.. జర్నలిస్టులు మానవీయ కోణంలో వార్తలు రాస్తే తగిన గుర్తింపు వస్తుందన్నారు.తొలిసారిగా వనపర్తి జిల్లాకు రాష్ట్ర పదవి దక్కిందని ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా జర్నలిస్టులకు సేవలందిస్తూనే ఉంటానని అన్నారు. తాను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక అయ్యేందుకు సహకరించిన యూనియన్ రాష్ట్ర, అధ్యక్ష కార్యదర్శులు విరహత్ అలీ, రామ్ నారాయణ లకు కృతజ్ఞతలు తెలిపారు.

తాను బాధ్యులుగా మొదటి ప్రాధాన్యత వనపర్తి జిల్లాకు ఉమ్మడి జిల్లాకు ఉంటుందని అన్నారు.జర్నలిస్టుల సమస్యలతో పాటు వారికి ఏ విధమైన సమస్య ఉన్న సంఘం పరిష్కారానికి కృషి చేసింది అన్నారు. జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సహకారంతో తాను ఈ స్థాయికి ఎదిగానని ఎంత ఎదిగిన జర్నలిస్టుల సమస్యల విషయంలో రాజీ లేని పోరాటం చేస్తూనే ఉంటానని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టుల మౌలిక సదుపాయాల కల్పన కోసం తన వంతు పాత్ర పోషించానని అన్నారు. వనపర్తి జర్నలిస్టుల సంఘటిత శక్తి తన పదవి అని, జర్నలిస్టులు సంకిచిత భావాన్ని వీడి పని చేయబోతున్నారు. పొగడ్తలు విమర్శలు రెండును స్వీకరించే తత్వం తనదని ఎదుటి వ్యక్తి ఎంత విమర్శించినా నవ్వుతూ స్వీకరించి విమర్శలను మర్చిపోతూ వారితో సఖ్యత ఉండడమే తన బలమని చెప్పారు. త్వరలో ప్రెస్ అకాడమీ నుంచి జర్నలిస్టు పిల్లలకు విద్య అందించే జీవో రాబోతుందని ఆ పనులు వేగవంతం అవుతున్నాయి. జర్నలిస్టుల వైద్య సదుపాయం గృహాలు తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఆయనను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కారం చేశారు. అదేవిధంగా ఇటీవల రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన రమేష్ ను సన్మానించారు.సభ ప్రారంభానికి ముందు ఈనాడు, ఈటీవీ వ్యవస్థాపకులు స్వర్గీయ రామోజీరావుకు ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ నాగర్ కర్నూల్ జిల్లా ఇంచార్జి శ్యామ్, వనపర్తి కార్యదర్శి మాధవ్, జాతీయ కౌన్సిల్ సభ్యుడుప్రశాంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రమేష్, సీనియర్ పాత్రికేయులు ఉషన్న, పౌర్ణరెడ్డి, బి.రాజు, ఖలీల్ ఎల్లగౌడ్, సాహితీ కళావేదిక కన్వీనర్ పలుశంకర్ గౌడ్, గంధం నాగరాజు, కాంగ్రెస్ పార్టీ మహిళా కన్వీనర్ ధనలక్ష్మి వాల్మీకి సంఘం నాయకులు రాములు, పట్టణ, అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, ధ్యారపోగు మన్యం, జర్నలిస్ట్ నాయకులు భాస్కర్, దినేష్, కుమార్, విజయ్, నా కొండ,జిల్లా ఉర్దూ పత్రికలు, మహ్మద్ కమల్,ఎండి షఫీ,ఎండీ షీరాజ్,నశిరోద్దీన్, ఎండీ ఏ సలాహి, అబ్దుల్ వహి, ,గోపాల్ జిల్లా ఫోటో జర్నలిస్టులు ఎస్.వి రమేష్, రాము,యాదిరెడ్డి,శ్రీకాంత్ ,వివిధ మండలాల అధ్యక్షులు కార్యదర్శులు నాయకులు అధిక సంఖ్యలో ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech