Home తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం నూతన విధానం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

జర్నలిస్టుల సంక్షేమం కోసం నూతన విధానం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
జర్నలిస్టుల సంక్షేమం కోసం నూతన విధానం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • తెలంగాణ మీడియా సంస్థ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి
  • మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు కే సత్యనారాయణలకు ఘనంగా స్వాగతం పలికిన సూర్యాపేట జర్నలిస్టులు

సూర్యాపేట ముద్ర ప్రతినిధి:- జర్నలిస్టుల సంక్షేమం కోసం త్వరలో నూతన విధానాన్ని రూపొందించామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఖమ్మంలో జరుగుతున్న టి యు డబ్ల్యూ జే ఐజేయు రాష్ట్ర మహాసభలకు వెళుతున్న సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, ఐజే యు జాతీయ కార్యవర్గ సభ్యులు కొణిజేటి సత్యనారాయణ లకు సూర్యాపేట జర్నలిస్టులు పూల బొకేలు, శాలువాలతో సన్మానించి ఘన స్వాగతం పలికిన సందర్భంగా మీడియా అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడారు. .

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన ఇల్లు, ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పట్ల తమ సమస్యలు పరిష్కారం అవుతాయని జర్నలిస్టులలో ఒక రకమైన నమ్మకం, విశ్వాసం ఏర్పడ్డట్లు చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి శాసనసభ వ్యవహారాలు, ఓటు ఆన్ అకౌంట్, తదుపరి లోక్‌సభ ఎన్నికలు వరుసగా రావడంతో పరిపాలనపై దృష్టి కేంద్రీకరించే విషయం కొంత ఆలస్యమైందని తెలిపారు. అయితే రాష్ట్ర సమాచార శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో చర్చించడం జరిగింది, మీడియా అకాడమీ చైర్మన్ గా తాను, సమాచార శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి తో చర్చించి జర్నలిస్టుల సంక్షేమం కోసం విధి విధానాలు రూపొందించిన వెంటనే సంతకం చేసి తాను సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో జర్నలిస్టులకు ఈ ప్రభుత్వం పట్ల సానుకూల భావనలు ఏర్పడ్డాయని.

హెల్త్ కార్డుల విషయంలో ఏర్పడ్డ సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో 24 వేల అక్రిడిటేషన్లు ఉన్నాయని వివరించారు. అనర్హులకు అక్రిడిటేషన్లు అందకుండా ఒక క్రీం తప్పకుండా ఏర్పాటు చేయబడ్డాయి, ప్రతి జర్నలిస్టులకు అర్హులైన ప్రతి జర్నలిస్టుకు వచ్చేలా ప్రకటించింది. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో జరిగిన కుటుంబం ఆత్మహత్య విషయంలో జర్నలిస్టుల బ్లాక్ మెయిల్ కారణంగా జర్నలిస్టుల వృత్తికి మచ్చ ఏర్పడిందని, ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అనర్హులు అక్రిడిటేషన్ పొందడం వల్ల జర్నలిజం వృత్తి, వ్యక్తిత్వము మసక బారే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నెలతో ముగుస్తున్న అక్రిడిటేషన్ల గడువును మరో మూడు నెలలు పెంచి ఈ లోపుగా కొత్త అక్రిడిటేషన్ల విషయంలో మిస్ యూజ్ కాకుండా కసరత్తు ప్రారంభిస్తామని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, ఐజేయు జాతీయవర్గ సభ్యులు కొణిజేటి సత్యనారాయణ, యూనియన్ హర్యానా, బీహార్ రాష్ట్ర అధ్యక్షులు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కోశాధికారి రాజేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ , ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు బత్తుల మల్లికార్జున్, రెబ్బ విజయకుమార్, నాగరాజు,రామకృష్ణ, హరి, జర్నలిస్టులు ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech