ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన మంజూరికి అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ, ప్రథమ సమావేశం శనివారం హైదరాబాద్లోని బూర్గుల రామకృష్ణారావు భవనంలో జరిగింది.
మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ , సియాసత్ న్యూస్ ఎడిటర్ , ఎమ్మెల్సీ , అమీర్ అలీ ఖాన్ , హిందూ పొలిటికల్ ఎడిటర్ ఆర్ రవికాంత్ రెడ్డి , నవ తెలంగాణ పత్రిక సీనియర్ ఫోటో జర్నలిస్ట్ , కె .నరహరి , పౌర సంబంధాల శాఖ జాయింట్ డి. యస్. జగన్ ఉన్న. సమావేశంలో రాష్ట్ర హైకోర్టు తీర్పులు, నూతన మార్గదర్శకాలు, వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న అక్రిడిటేషన్ కమిటీ నిబంధనలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ఇతర మీడియాకు అక్రిడిటేషన్ల గురించి ప్రాథమికంగా చర్చించారు.
రాష్ట్రంలో నూతన మార్గదర్శకాలపై జర్నలిస్టు యూనియన్లు/సోసియేషన్లు, ప్రెస్ క్లబ్బులు, వ్యక్తుల నుండి ప్రత్యేక కమిటీకి రాతపూర్వకమైన సలహాలు, సూచనలను ఆహ్వానించారు. నవంబర్ 15లోగా వాటిని సమాచార పౌర సంబంధాల శాఖ, జైంట్ డైరెక్టర్ (ఎం ఆర్) కు అందజేయాల్సిందిగా కోరింది.