Home తాజా వార్తలు జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలి … – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలి … – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

by Prajapalana
0 comments
జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలి ... - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • ఐ జే యూ ఎన్ ఈ సీ మీటింగ్ లో కే శ్రీనివాస్ రెడ్డి డిమాండ్
  • (కె. రామనారాయణ)

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్):ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ సమావేశాలు గురువారం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర శాఖ మంత్రి సుభోద్ అనియాల్ సూచనలు. అంతకుముందు ఐజేయు అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి సమావేశాన్ని ప్రారంభిస్తూ దేశంలో జర్నలిస్టులకు రక్షణ కరువైందని, వారికి ప్రత్యేక రక్షణ చట్టం కావాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ పై జర్నలిస్టు సమాజంలో చర్చ జరుగుతుందని, తమ సంఘం వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టిందని తెలిపారు. జర్నలిస్ట్ లకు స్వేచ్ఛకావాలని తాము కట్టుబడి ఉన్నామని చెపుతున్న పాలకులు ప్రత్యేక రక్షణ చట్టం లేకపోవడం విచారకరమన్నారు.

జర్నలిస్టులకు 1955లో ఆనాటి పార్లమెంటులో వర్కింగ్ జర్నలిస్ట్స్ యాక్ట్ ను నేడు మరింత పటిష్టంగా తయారు చేయవలసింది బదులు అందుకు విరుద్ధంగా కార్మిక చట్టాల కోడిఫికేషన్ పేరుతో దాన్ని పూర్తిగా రద్దు చేయడం ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. కొత్తగా తెచ్చిన బిల్లు దేశంలో ఉన్న జర్నలిస్టులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. తమ సంఘం కూడా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లును తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం శోచనీయమన్నారు. గత చట్టంలో కొత్త చట్టం వస్తుంటే గతం కంటే ఎక్కువ ఉపయోగాలు జర్నలిస్టులకు ఉండేలా బిల్లు తప్ప గతంలో ఉన్న సౌకర్యాలను తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకోవడం తగదని హితవు పలికారు.

ఎవరికోసం అయితే బిల్లు తేవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నదో సంబంధిత వర్గమైన జర్నలిస్టు సమాజాన్ని, సంఘాలను విశ్వాసంలోకి తీసుకోకపోవడం సరికాదన్నారు. కచ్చితంగా జర్నలిస్ట్ సంఘాల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

15 సంవత్సరాల క్రితం వెజ్ బోర్డు రద్దు అయిందని నాటినుండి నేటి వరకు వెజ్ బోర్డు గురించి పాలకులు పట్టించుకోకపోవడం జర్నలిస్టులపై వారికున్న ప్రేమ ఏ పాటిదో నిరూపించింది. వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని పునఃపరిశీలించడంతోపాటు జర్నలిస్టులకు మేలు చేసే విధంగా చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించారు. జర్నలిస్టులపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయని వ్యాపారులు, రాజకీయ నాయకులు, మాఫియా ముఠాలు జర్నలిస్టులపై దాడులు చేస్తున్నాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు లేక పోవడం దారుణమని అన్నారు.

ప్రజాస్వామ్యంలో పత్రికకు స్వేచ్ఛ లేకపోవడం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని అన్నారు. జర్నలిస్టులకు పకడ్బందీగా రక్షణ చట్టం తేవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఇందుకోసం తమ సంఘం కార్యాచరణ రూపొందించి జర్నలిస్టుల హక్కుల కోసం రక్షణ చట్టం కోసం , వేతన చట్టం, మీడియా కమిషన్ కోసం ఆందోళనలు చేపడుతుందని పేర్కొన్నారు.

సమావేశంలో ఐ జేయూ సెక్రటరీ జనరల్ బల్వీందర్ జమ్మూ , మాజీ అద్యక్షులు ఎస్ ఎన్ సిన్హా, దేవులపల్లి అమర్, ఐజేయూ కార్యదర్శి జయ్ సింగ్ రావత్, ఉత్తరాఖండ్ అధ్యక్షుడు, కార్యదర్శులు ఉమాశంకర్ మోహతా, గిరీష్ పంత్ , స్టీరింగ్ కమిటీ సభ్యులు మాజీ, కార్యవర్గసభ్యులు ఆలపాటి సురేష్ కుమార్, తెలంగాణ అద్యక్ష ప్రధాన్యదర్శులు , కె.రాంనారాయణ, ఎపీయూడబ్ల్యూజే అద్యక్ష ప్రధానకార్యదర్శులు ఐ వి సుబ్బారావు, చందు జనార్ధన్ భర్తీ అయ్యారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech