Home తెలంగాణ జర్నలిజం ముసుగులో జనాన్ని పీడిస్తే సహించేది లేదు.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

జర్నలిజం ముసుగులో జనాన్ని పీడిస్తే సహించేది లేదు.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
జర్నలిజం ముసుగులో జనాన్ని పీడిస్తే సహించేది లేదు.. - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • నిజమైన జర్నలిస్టుల జోలికొస్తే ఊరుకోం
  • జిల్లా జర్నలిస్టు సంఘం, సిద్దిపేట ప్రెస్ క్లబ్ స్పష్టీకరణ

సిద్దిపేట,ముద్ర ప్రతినిధి : ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజం ది కీలకపాత్ర అని సమాజంలో జరుగుతున్న మంచి చెడులను ప్రసారం చేసి ప్రజలకు సమాచారం అందించడం జర్నలిస్టుల ప్రధాన బాధ్యత అని సిద్దిపేట ప్రెస్ క్లబ్, జర్నలిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షుడు రంగచారి అన్నారు. సోమవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జర్నలిస్ట్ నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ జర్నలిజంలో ఇటీవల కొన్ని దుష్పరిణామాలు జరుగుతున్నాయని ప్రధాన పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు ఒకవైపు తన పాత్రను నిర్వహిస్తున్నప్పుడు రోజుకి విస్తరిస్తున్న సోషల్ మీడియా కుడా మీడియా రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నప్పటికీ, కొన్ని సోషల్ మీడియాలోని సంస్థలు, వ్యక్తులు జర్నలిజంపై బ్రష్టు పట్టించే చర్యలకు సంబంధించిన రోజురోజుకు నమోదవుతున్నాయి. ఇది సమాజాన్ని చెడు వైపు నడిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు . ఇది సమాజానికి, పత్రిక,మీడియా స్వేచ్ఛకు మంచిది కాదన్నారు. పత్రిక, మీడియా ముసుగులో కొందరు వ్యక్తులు, సంస్థలు బరితెగించి వ్యవహరిస్తున్నారని. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వివిధ సంస్థలను, ప్రభుత్వ ప్రైవేటు వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు.

ఇది నిజమైన జర్నలిజం కాదు. అలాగే ఇది జర్నలిస్టులకు ఉండాల్సిన లక్షణం ఎంత మాత్రం కాదన్నారు. ఇటీవల సిద్దిపేటలో కొందరు వ్యక్తులు జర్నలిజం ముసుగులో బెదిరింపులకు ఉన్నారు. ఈ వ్యవహారాన్ని తాము జర్నలిస్టులుగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వారి చర్యలను తాము ఎంత మాత్రం సమర్థించ లేమన్నారు . జర్నలిజం ముసుగులో బెదిరింపులకు వ్యక్తులు, సంస్థల పట్ల ఎవరైనా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బెదిరింపులకు ప్రదర్శించిన , వ్యక్తులకు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లేదా జర్నలిస్ట్ సంఘం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎవరైనా చట్టపరంగా తీసుకునేలా చూస్తామని స్పష్టం చేశారు.

అదేవిధంగా జర్నలిస్టు వృత్తిని నిబద్ధతతో నిర్వహిస్తున్న సమాజంలో మంచి,చెడును బహిర్గతం చేస్తున్న నిజమైన జర్నలిస్టుల పై ఎవరు దాడులు, బెదిరింపులకు గురిచేసిన చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వారిపట్ల కఠినంగా వ్యవహరించారు. చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టు సంఘం నాయకులు హరిపురం రఘునందన్ స్వామి, దూది దుర్గారెడ్డి, బబ్బురి రాజు, నాయినిసంజీవరెడ్డి, మజ్జు,మాడూరి శ్రీరామ్, రంగదాంపల్లి శీను,అయిత శ్రీనివాస్,ఆకుల పాండురంగం,సాజిద్ ,రాజు, మల్లారెడ్డి, ఇంద్రశేఖర్,బాబు, భాస్కర్ రెడ్డి, జీకురుపరమేశ్వర్,రాజబాబు, సాయి గౌడ్,అంజి, గిరి,సతీష్,నగేష్,ఎల్లయ్య,వెంకట్ మురళి, ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech