36
ముద్ర,సెంట్రల్ డెస్క్:-ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం వేళ జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల దాడి జరిగింది. యాత్రికుల బస్సుపై ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 10 మంది యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 33 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రియాసి అనే జిల్లాలో ఈ ఘటన జరిగింది. రాన్సు నుంచి ఖత్రాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం మేరకు పోలీసులు, భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.