Home ఆంధ్రప్రదేశ్ జమిలి బిల్లు ఈ వారంలోనే.. ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు – Prajapalana News

జమిలి బిల్లు ఈ వారంలోనే.. ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు – Prajapalana News

by Prajapalana
0 comments
జమిలి బిల్లు ఈ వారంలోనే.. ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు


జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు బిజెపి అడుగుని కేంద్ర ప్రభుత్వం జోరుగా జరుపుతోంది. ఇప్పటికే జమిలి బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లును ఈ వారంలో పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది న్యాయశాఖ మంత్రి అర్జున్ మేగ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. లోక్ సభకు దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులకు గత గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించింది. సోమవారమే జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతారనే ప్రచారం జరిగింది. కానీ, సోమవారం ప్రవేశపెట్టనున్న బిల్లుల జాబితాలో జమిలి ఎన్నికల బిల్లు లేకపోవడంతో ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందనే ప్రచారం మొదలైంది. అయితే, ఈ ప్రచారాన్ని బిజెపి వర్గాలు కొట్టి పారేసాయి. జమిలి ఎన్నికల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశాయి. మంగళవారం గాని ఈ వారంలో గాని బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. జమిలి ఎన్నికలకు సంబంధించి రెండు బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో మొదటిది లోక్ సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు కాగా రెండోది శాసనసభ్యులు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన సాధారణ బిల్లు. ఉభయ సభలో ఈ బిల్లులను ప్రవేశపెట్టిన వెంటనే జైంట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపిన బిజెపి వర్గాలు చెబుతున్నాయి. ఈసారి కేవలం లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలపై కేంద్రం దృష్టి సారించింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల విషయంలో మాత్రం కేంద్ర నిర్ణయం తీసుకోలేదు. స్థానిక ఎన్నికలను తర్వాత పరిశీలించినట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి. జమిలి ఎన్నికల కోసం మొత్తం ఆరు బిల్లులు పెట్టాల్సి ఉండగా ప్రస్తుతం వాటికే పరిమితం అవుతున్నాయి. తొలి బిల్లులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 83, ఆర్టికల్ 172 సవరిస్తారు. ఇందుకు ఉభయ సభలో మూడింట రెండు వంతుల మంది సభ్యుల మద్దతు అవసరం. లోక్ సభలో మూడింట రెండు వంతులు అంటే 361 మంది సభ్యులు మద్దతు కావాలి. ఎండిఏ కూటమి బలం 293 మాత్రమే. వైసిపి, బీజేడి, అన్నా డీఎంకే మద్దతు ఇచ్చిన 2/3 చేరుకోవడం అసాధ్యం. రాజ్యసభలో 154 మంది ఎంపీలకు మద్దతు కావాలి. ఎండిఏ బలం, నామినేటెడ్ సభ్యులను కొలుకొని 119 మాత్రమే. అంటే ఉభయ సభలో బిల్లు నెగ్గడం అంత తేలికేమీ కాదు. అయితే జమిలి బిల్లుపై వీలైనన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. జమిలి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంలోనూ స్పష్టత లేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగే దేశమంతా ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

రేషన్ కార్డులపై కీలక ప్రకటన.. అర్హులకు కొత్త రేషన్ కార్డులు పొందేందుకు ఓకే.!
లిక్కర్ డ్రింకింగ్ | మద్యపానం వల్ల కలిగే దుష్పరిణామాలు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech