38
భూకంపం జపాన్: జపాన్లోని ఇషికావాలో ఇవాళ ఉదయం 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. మరో పది నిమిషాల తర్వాత 4.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. నోటో పీఠభూమి అంతర్భాగంలో 10KM లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సునామీ ముప్పు లేదని చెప్పారు.
కాగా ఇదే ప్రాంతంలో ఈ ఏడాది జనవరి 1న సంభవించిన భూకంపంలో 230 మంది మరణించారు.