ఉత్తరాంధ్ర సీనియర్ నేత, శాసనమండలిలో వైసీపీ ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ పార్టీ మార్పుపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. గడిచిన కొన్నాళ్లుగా ఆయన జనసేనలో చేరారు అంటూ ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఆయన సోదరుడు జనసేనలో చేరారు. ఇదంతా బొత్స సత్యనారాయణ సూచనల మేరకే జరిగింది అప్పట్లో విజయనగరంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత రాజకీయాల్లో బొత్స చురుగ్గా ఉంటూ వస్తున్నారు. శాసన మండలికి ఎన్నికైన తర్వాత బొత్స వైసీపీలో మరింత యాక్టివ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన జనసేనలో చేరుతారంటూ జరిగిన ప్రచారం కొంతవరకు తగ్గింది. అయితే అనూహ్యంగా రెండు రోజుల కిందట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ సమావేశం అనంతరం బొత్స సత్యనారాయణ కలిశారు. శాసన మండలి నుంచి బయటకు వస్తున్న బొత్స సత్యనారాయణ.. అటుగా వెళుతున్న పవన్ కళ్యాణ్ ని చూసి ముందుకు వెళ్లారు. ఇరువురు నేతలు కరచాలనం చేసుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ కలయిక ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో దుమారాన్ని రేపుతోంది. బొత్స సత్యనారాయణ మరికొద్ది రోజుల్లో జనసేనలో చేరుతారంటూ విస్తృతంగా ప్రచారం. ఈ ప్రచారానికి ఆజ్యం పోసేలా ఈ కలయిక జరిగినట్లు చెబుతున్నారు.
బొత్స పార్టీ మార్పుపై ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన మాత్రం స్పందించలేదు. సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాతే ఆయన జనసేనలో చేరతారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయనను నిలుపుదల చేసే ఉద్దేశంతో శాసనమండలికి జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేశారు అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు పరిశోధకులు. బొత్స సత్యనారాయణ ప్రభుత్వ పెద్దల వ్యూహాలను చిత్తు చేస్తూ శాసనమండలికి ఎన్నికయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన వైసీపీకి దగ్గరగానే ఉన్నారు. దీంతో ఆయన పార్టీ మారతారన్న ప్రచారానికి పుల్ స్టాప్ పడింది. అయితే అనూహ్యంగా శాసన మండలి, శాసనసభ సమావేశాల సందర్భంగా పవన్ కళ్యాణ్ తో ఆయన కరచాలనం చేయడం, ఇద్దరూ రెండు నిమిషాల పాటు మాట్లాడడం మరోసారి బొత్స సత్యనారాయణ పార్టీ మార్పుకు సంబంధించిన చర్చ జరగడానికి కారణమైంది. పార్టీ మారతారు అన్న అంశంపై ఇటు వైసిపి నాయకులు గాని, బొత్స అనుచరులు గాని ఎక్కడ లీకులు ఇవ్వలేదు. అదే సమయంలో బొత్స పార్టీలో చేరతారు అన్నదానిపై జనసేన నుంచి కూడా ఎటువంటి ప్రకటన రాలేదు. పార్టీ మార్పునకు సంబంధించి బొత్స వ్యూహాత్మకంగానే మౌనం వహిస్తున్నారని, సమయం అంటూ వచ్చినప్పుడు ఆయన జనసేనలో చేరతారు మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి బొత్స మనసులో ఏముందో బయటకు తెలియాల్సి ఉంది. బొత్స పార్టీ మార్పులకు సంబంధించి స్పష్టత రావడానికి మరి కొంత సమయం పట్టి అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయనకు ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో బలమైన పట్టు ఉంది. ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో పాటు అంగ బలం కూడా ఉంది. మూడు జిల్లాల్లో పెద్ద ఎత్తున అనుచరగణం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనను పార్టీలో చేర్చుకునే ఉద్దేశాన్ని జనసేన నాయకులు కనబరుస్తున్నట్లు చెబుతున్నారు. కానీ వైసీపీలో కూడా ఆయనకు తగిన గౌరవాన్ని ఇస్తుండడం, శాసనమండలిలో ప్రతిపక్షనేతగా అవకాశం కల్పించడం వంటి అంశాలను పార్టీ పరిగణలోకి తీసుకుంటే ఆయన మారే ఆలోచన చేయకపోవడాన్ని పలువురు చెబుతున్నారు. అయితే వైసిపి ఉత్తరాంధ్ర బాధ్యతలను మరోసారి విజయసాయి రెడ్డికి అప్పగించడం పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నారని, ఏ ఉద్దేశ్యంతో ఆయన పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బొత్స గనుక పార్టీ మారినట్లు అయితే వైసీపీకి గట్టి దెబ్బ గానే భావించాల్సి ఉంటుంది. అదే సమయంలో జనసేనలో ఆయన చేరతారన్న ప్రచారాన్ని చాలామంది ఖండిస్తున్నారు. దీనికి కారణం బొత్స రాజకీయ జీవితమంతా తెలుగుదేశానికి వ్యతిరేకంగానే సాగుతూ వచ్చింది. అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేనలో ఆయన చేరే అవకాశం లేదని మరికొందరు చెబుతున్నారు. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడి ప్రకారం ఏదైనా జరగాలంటే మరికొందరు అంటున్నారు. చూడాలి మరి రాజకీయంగా బొత్స భవిష్యత్తులో వేసే అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయో.
గ్రాండ్ విక్టరీ సాధించిన.. తొలి టెస్ట్ లో ఘనవిజయం
పరగడుపున ఈ పండ్లను అస్సలు తినొద్దు