Home సినిమా జనవరి 7 ప్రముఖ నిర్మాత, సినీ పాత్రికేయుడు బి.ఎ.రాజు 65వ జయంతి – Prajapalana News

జనవరి 7 ప్రముఖ నిర్మాత, సినీ పాత్రికేయుడు బి.ఎ.రాజు 65వ జయంతి – Prajapalana News

by Prajapalana
0 comments
జనవరి 7 ప్రముఖ నిర్మాత, సినీ పాత్రికేయుడు బి.ఎ.రాజు 65వ జయంతి


తెలుగు సినీ పరిశ్రమలో 40 ఏళ్ల పాటు నెంబర్ వన్ స్థానంలో సినీ జర్నలిస్టుగా, పిఆర్ఓగా, సినీ వార పత్రిక, వెబ్‌సైట్ అధినేతగా,నిర్మతగా అందరికీ తలలో నాలుకగా వ్యవహరించిన బిఏ రాజు గారి (జనవరి 7న) 65వ జయంతి సందర్భంగా ఒక స్పెషల్ స్టోరీ చూద్దాం.

సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలను చూస్తే పిఆర్ఓగా సినీ కెరీర్ ప్రారంభించిన బిఏరాజు ఆ తరువాత ఆయన ప్రోత్సహంతోనే సినీ పాత్రికేయుడిగా రాణించారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి, ఉదయం, శివరంజని, వంటి దిన, వారపత్రికలలో వివిధ హోదాలలో పనిచేసి అనంతరం తన సతీమణి బి జయ సహచర్యంతో 1994లో సూపర్ హిట్ వార పత్రిక స్థాపించి, తెలుగు సినీ వార్తాపత్రికలలో సంచలనం సృష్టించారు. ఆయన మరణం వరకు ఒక్క సంచిక మిస్సవకుండా 27 సంవత్సరాలపాటు పత్రికను దిగ్విజయంగా నిర్వహించడం అంటే ఆయన అఖండ దీక్ష ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

కేవలం సినీ జర్నలిస్టుగానే కాకుండా అగ్ర దర్శకులకు, హీరోలకు, హీరోయిన్లకు గైడ్ లైన్స్ ఇస్తూ వారి సినీ కెరీర్ కి మార్గదర్శకుడిగా నిలిచారు రాజు గారు. సుమారు 1500 చిత్రాలకు పైగా పబ్లిసిటీ ఇంఛార్జిగా పని చేసిన బిఏ రాజు ఆయా చిత్రాల విజయాలకు దోహదపడ్డారు. చిత్ర పరిశ్రమలో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరచుకుని అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు బి.ఏ.రాజు. తెలుగు సినీ రంగం హైదరాబాద్ బదిలీ కావడంతో 2001లో సూపర్ హిట్ అడ్మిస్ట్రేషన్ ఆఫీస్ కూడా హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారు. ఆ ఏడాదే అయన నిర్మాతగా, ఆయన భార్య బి జయ దర్శకురాలిగా 'ప్రేమలో పావని కళ్యాణ్' అనే చిత్రంతో ఆర్జే సినిమా బ్యానర్ మీద నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. రాజు గారు ప్రారంభించిన ఇండస్ట్రీ హిట్ వెబ్ సైట్ ద్వారా, దాదాపు 7 లక్షల మంది ఫాలోవర్స్ కలిగిన పాపులర్ అయిన ఆయన (ట్విట్టర్) ఎక్స్ అకౌంట్ పరిశ్రమకు సంబంధించిన వార్త విశేషాలు ఆయన బృందం, BA Raju's Team ద్వారా అందించారు. ఆర్జే సినిమాల ద్వారా ఆయన తనయుడు శివకుమార్ బి కూడా నిర్మాతగా త్వరలో ప్రముఖ హీరోలతో చిత్రాలను ప్రకటించనున్నారు.

చిత్ర పరిశ్రమ ప్రముఖులందరితో అత్యంత సన్నిహిత సంబంధాలు… ముఖ్యంగా ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబులతో రాజు గారికి మంచి అనుబంధం ఉండేది. అలాగే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా కూడా ఆయన పనిచేశారు. సినీ పాత్రికేయులకు ఈ కష్టం వచ్చినా నేనున్నాని, ఆర్ధిక, హార్దిక భరోసా ఇచ్చేవారు. ఏ దర్శకుడు ఏ హీరోతో ఎన్ని సినిమాలు నిర్మించాడో? బ్యానర్ పేరు, విడుదల తేదీ ఆ మూవీ ఎన్ని రోజు ఈ సెంటర్లలో ఆడిందో వంటి వివరాలను తడుముకోకుండా హ్యూమన్ టాలీవుడ్ ఎన్సైక్లోపీడియాలా టక్కున చెప్పేవారు. అంతటి సినిమా పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్నారు రాజు గారు. 24 గంటలు సినిమా గురించి ఆలోచించే బి.ఏ.రాజుమై ఏళ్లు గడుస్తున్నా ఆయన అందించే సేవలు అజరామరం. ఏ లోకాన వున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 65వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech