Home ఆంధ్రప్రదేశ్ జగన్ నామస్మరణ చేస్తున్న కూటమి నేతలు.. అదే సానుకూలంగా మారనుందా.? – Prajapalana News

జగన్ నామస్మరణ చేస్తున్న కూటమి నేతలు.. అదే సానుకూలంగా మారనుందా.? – Prajapalana News

by Prajapalana
0 comments
జగన్ నామస్మరణ చేస్తున్న కూటమి నేతలు.. అదే సానుకూలంగా మారనుందా.?


సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాభవం తరువాత ఆ పార్టీ మునుగడపై సర్వత్ర ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైసిపి.. ఐదేళ్లు గడచిన తర్వాత జరిగిన ఎన్నికల్లో దారుణంగా 11 స్థానాలకు పడిపోయింది. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనానికి సంకేతంగా చెబుతూ వచ్చారు. భవిష్యత్తులో వైసిపి మరోసారి అధికారంలోకి రాదు అంటూ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు ఆ పార్టీకి చెందిన నేతలు నాయకులు చెబుతూ వస్తున్నారు. ఈ స్థాయిలో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న పార్టీ గురించి ఎవరు పెద్దగా మాట్లాడకపోవడం మంచిది అని అధికార పక్షం కనిపిస్తోంది. అలా చేయడం వల్లే వైసీపీని ప్రజలు మరిచిపోయేలా చేయవచ్చు. కానీ, కూటమి నాయకులు ఇక్కడే తప్పు చేస్తున్నారు. జగన్ ఏ తప్పిదాలు చేసి అధికారాన్ని కోల్పోయారో.. ఇప్పుడు అటువంటి కూటమి నాయకులు చేస్తుండటం. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు, మంత్రులు చంద్రబాబు, ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులను హేళన చేస్తూ మాట్లాడారు. 23 స్థానాలకు పడిపోయారంటూ ఎద్దేవా చేశారు.

అనేక సందర్భాల్లో నోటి దురుసును కూడా ప్రదర్శించారు. అప్పుడు వైసీపీ నాయకులు చేసిన చేష్టలు, ప్రతిపక్షం పై మాట్లాడిన దుర్భాషలను సీరియస్ గానే తీసుకున్నారు. ఈ స్థాయిలో అహంకారం పనికిరాదు అన్న భావనతోనే చాలామంది గడిపిన ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు. గతంలో వైసిపి నిత్యం చంద్రబాబు నాయుడు నామస్మరణ చేయడం వల్ల.. ప్రజల్లో చంద్రబాబు, ఆ పార్టీ పట్ల చర్చకు వైసీపీ నాయకులు అవకాశం కల్పించారు. తత్ఫలితమే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున కూటమి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అయితే 2019 నుంచి 2024 మధ్యకాలంలో వైసీపీ చేసిన తప్పిదాన్నే ప్రస్తుతం కూటమి నేతలు చేస్తున్నారు. సాధారణంగా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన పార్టీ గురించి చర్చించకూడదు. ఆ పార్టీ అధినేత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దీనివల్ల ప్రజలు కూడా సదరు పార్టీ, ఆ పార్టీ నేతలను మరిచిపోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడ గతంలో వైసిపి వ్యవహరించినట్లుగానే కూటమి నాయకులు ఇప్పుడు పనిచేస్తున్నారు. ప్రతిరోజు కనీసం ఐదుగురు మంత్రులు జగన్మోహన్ రెడ్డి గత పాలనపై విమర్శలు చేస్తున్నారు. ఆయన ఇంటి గురించి మాట్లాడుతున్నారు. నిరంతరం ఆయన పై ఆరోపణలు చేస్తూ అవహేళనగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ మరోసారి ప్రజల్లో చర్చకు కారణం అవుతున్నాయి. సాధారణంగా ఎన్నికలు జరిగిన ఏడాది వరకు ప్రతిపక్షాలు కూడా పెద్దగా స్పందించలేదు. కానీ అధికార పార్టీ చేస్తున్న దాడి, అనుసారంగా మాట్లాడుతున్న మాటలకు వైసీపీ కూడా ఘాటుగా నచ్చుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జగన్మోహన్ రెడ్డి ఓటమిపాలైన నెల రోజులకే రోడ్ ఎక్కిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ లేని రీతిలో 15 సార్లు మీడియాతో మాట్లాడారు. ఇవన్నీ మరోసారి వైసీపీని ప్రజల్లో ఉండేలా చేస్తున్నాయన్న విశ్లేషణలు ఉన్నాయి. గతంలో ఏ తప్పిదాలు అయితే వైసిపి చేసి అధికారాన్ని కోల్పోయిందో.. ఇప్పుడు అటువంటి తప్పిదాలను ఓటమికి చెందిన పార్టీలు చేస్తున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు మాత్రమే పడిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డికి 40 శాతం ఓట్లు వచ్చాయి. ఐదేళ్లలో అటు ఇటు జరిగితే ఆరేడు శాతం ఓటు బ్యాంకు మారిన మరోసారి వైసిపి అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదు. తప్పనిసరిగా ఐదేళ్ల పాలన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ప్రస్తుతం కూటమీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, చర్యలతో గతంలో వైసిపి పట్ల అసంతృప్తితో కూటమి పార్టీలకు ఓట్లు వేసిన ఎంతోమంది మరోసారి జగన్ మోహన్ రెడ్డిపై సానుభూతితో వెనక్కి తిరిగే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో గత ఎన్నికల్లో వైసిపి పట్ల అభిమానం తమకు ఎటువంటి లబ్ధి చేకూరలేదన్న ఉద్దేశంతో ఎంతోమంది ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. నాయకులు చేస్తున్న అతితో అటువంటి వారంతా వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ వైపు మొగ్గే ఛాన్స్ ఉంది. అదే సమయంలో అరెస్టులు, దాడులు వంటి వాటితో బాధితులుగా ఉన్న వారంతా వచ్చే ఎన్నికల్లో కసితో వైసిపి పక్షాన పని చేసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి వైసీపీకి నాయకులు కల్పించే విధంగా ఉన్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మరి ఈ అంశాల పరిశీలనలోకి తీసుకొని పాలనపై కూటమి నేతలు దృష్టిసారిస్తారో.. లేదా ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాజకీయాలను సాగించి మరోసారి వైసిపి మనుగడ సాగించే అవకాశం కల్పిస్తారో చూడాలి.

కేసీఆర్‌ను తొక్కుకుంటూ వచ్చా.. తెలంగాణ గడ్డపై ఆ మొక్కను మొలవన్విను : సీఎం రేవంత్ రెడ్డి
బీట్‌రూట్ తినీ తినీ బోర్ కొడుతోందా.. ఇలా ట్రై చేయండి

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech