భూదాన్ పోచంపల్లి, ముద్ర:- భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రాన్ని పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా సోమవారం తడక రమేష్,వైఎస్ చైర్మన్ గా భారత రాజేంద్రప్రసాద్ ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 28 సంవత్సరాల క్రితం ప్రారంభమైన అర్బన్ బ్యాంకు నేడు 10 బ్రాంచ్‌లుగా అభివృద్ధి చెందడం సంతోషదాయకమని అన్నారు. రానున్న ఐదు సంవత్సరాలలో 30 బ్రాంచ్‌లుగా అభివృద్ధి కోసం సాయశక్తులా కృషి చేస్తానని అన్నారు.
ఆర్బిఐ నిబంధనలకు లోబడి భాధ్యతాయుతంగా పనిచేస్తుందని తెలియజేసారు. 5 సంవత్సరాల కాలంలో వచ్చి వేతనాన్ని మొత్తం పేద ప్రజల విద్య, వైద్య అవసరాలకు ఖర్చు పెడతానని హామీ ఇచ్చారు. మరి కొన్ని రోజుల్లో తడక ఫౌండేషన్ ను ప్రారంభించి పేద ప్రజలకు అండగా ఉంటానని. అదేవిధంగా పాలకవర్గంతో చర్చించి ఓటు హక్కును కోల్పోయిన ఖాతాదారులకు ఖాతాలను పునరుద్ధరించే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కర్నాటి బాలసుబ్రమణ్యం, సూరపల్లి రమేష్, ఏలే హరి శంకర్, రాపోలు వేణు, కొండమడుగు ఎల్ల స్వామి, గుండు కావ్య, కర్నాటి భార్గవి ఉన్నారు.